Centre Warns Restaurants: సర్వీసు ఛార్జీల వసూలు.. రెస్టారెంట్లకు కేంద్రం వార్నింగ్

వినియోగదారుల నుంచి సర్వీసు ఛార్జీల పేరిట రెస్టారెంట్లు అక్రమంగా బిల్లులు వసూలు చేస్తుండటంపై కేంద్రం సీరియస్ అయింది. సర్వీసు ఛార్జీలు బలవంతంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Centre Warns Restaurants: సర్వీసు ఛార్జీల వసూలు.. రెస్టారెంట్లకు కేంద్రం వార్నింగ్

Restaurants

Centre Warns Restaurants: వినియోగదారుల నుంచి సర్వీసు ఛార్జీల పేరిట రెస్టారెంట్లు అక్రమంగా బిల్లులు వసూలు చేస్తుండటంపై కేంద్రం సీరియస్ అయింది. సర్వీసు ఛార్జీలు బలవంతంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి సర్వీస్ ఛార్జీలు బలవంతంగా వసూలు చేస్తున్నాయి.

Qutub Minar Row: కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ

నిజానికి సర్వీసు ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదు. నిబంధనల ప్రకారం బిల్లులో సర్వీసు ఛార్జీలు కలిపినప్పటికీ, అవి చెల్లించడం, చెల్లించకపోవడం వినియోగదారుల ఇష్టం. ఎవరైనా స్వచ్ఛందంగా మాత్రమే సర్వీస్ ఛార్జి చెల్లించవచ్చు. ఒకవేళ సర్వీస్ ఛార్జి చెల్లించకపోతే వసూలు చేసే హక్కు రెస్టారెంట్లకు లేదు. కానీ, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు తప్పనిసరిగా వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా దీనికి నిరాకరిస్తే బలవంతంగా వసూలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారుల నుంచి వస్తున్నఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. వీటిని రెస్టారెంట్లు బలవంతంగా వసూలు చేయొద్దని సూచించింది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 2న ‘నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’తో చర్చలు జరపనుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం

ఏప్రిల్ 2017 చట్టం ప్రకారం రెస్టారెంట్లు సర్వీసు చార్జీలు వసూలు చేయరాదు. సర్వీసు ఛార్జీలు చెల్లించని కారణంగా వినియోగదారులు ఎవరినీ రెస్టారెంట్లలోపలికి అనుమతించకపోయినా చట్ట ప్రకారం నేరమే. సాధారణంగా రెస్టారెంట్లు బిల్లులో ఐదు నుంచి పది శాతం వరకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి.