Qutub Minar Row: కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ

పురాతత్వ శాఖ రక్షణలో ఉన్న కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ). కుతుబ్ మినార్‌ను దేవాలయంగా పునురుద్దరించాలి అంటూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇచ్చింది ఏఎస్ఐ.

Qutub Minar Row: కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ

Qutub Minar

Qutub Minar Row: పురాతత్వ శాఖ రక్షణలో ఉన్న కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ). కుతుబ్ మినార్‌ను దేవాలయంగా పునురుద్దరించాలి అంటూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇచ్చింది ఏఎస్ఐ. కుతుబ్ మినార్‌ను రాజా విక్రమాదిత్య అనే హిందూ రాజు నిర్మించాడని, అది హిందూ దేవాలయమని ఇటీవల ఏఎస్ఐకు చెందిన మాజీ ఉద్యోగి దరమ్ వీర్ శర్మ చెప్పారు.

Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు

దీంతో అప్పటి నుంచి కుతుబ్ మినార్‌పై వివాదం మొదలైంది. దీన్ని హిందూ దేవాలయంగా మార్చాలని చాలా మంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్‌ను తిరిగి దేవాలయంగా మార్చాలని, అక్కడ దేవాలయానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు ఏఎస్ఐ వివరణ కోరింది. ‘‘కుతుబ్ మినార్‌ 1914 నుంచి చారిత్రక ప్రదేశంగా పురాతత్వ శాఖ రక్షణలో ఉంది. ఇప్పుడు దీని నిర్మాణాన్ని మార్చడం కుదరదు. రక్షణ ఉన్న చారిత్రక ప్రదేశాన్ని దేవాలయంగా మార్చడం సాధ్యం కాదు. ఇక్కడ దేవాలయ కార్యకాలపాల నిర్వహణకు అవకాశం లేదు’’ అని కోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఏఎస్ఐ పేర్కొంది.

Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం

మరోవైపు కుతుబ్ మినార్‌ వద్ద తవ్వకాలకు సంబంధించి కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుతుబ్ మినార్‌ హిందూ దేవాలయం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిగ్గు తేల్చేందుకు, దీని పరిధిలో తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. కుతుబ్ మినార్‌ పరిధిలో దాదాపు 15 మీటర్ల వరకు తవ్వకాలు జరిపే వీలుంది.