Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం

శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు.

Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం

Tirumala

Tirumala: తిరుమలలో భక్తులు దళారుల చేతుల్లో మోసపోతున్న ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక దళారి భక్తులను మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు. మూడు కుటుంబాలకు తొమ్మిది అభిషేకం టిక్కెట్లు ఇప్పించేందుకు నాలుగున్నర లక్షలు వసూలు చేశాడు. గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకున్నాడు.

 

డబ్బులు తీసుకున్న తర్వాత శరవణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు, దళారిపై టీడీపీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు దళారిపై తిరుమల టూటౌన్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.