Sukheebhava Sharat: ‘సుఖీభవ’ శరత్‌ షాకింగ్ ఫ్లాష్ బ్యాక్.. దాడికి కారణం ఇదేనట.. !

సుఖీభవ ఫేమ్ శరత్‌పై జరిగిన దాడి.. సంచలనమైంది. ఈ విషయమై స్పందించిన శరత్.. తనపై జరిగిన దాడికి కారణాలను మీడియాకు వెల్లడించాడు.

Sukheebhava Sharat: ‘సుఖీభవ’ శరత్‌ షాకింగ్ ఫ్లాష్ బ్యాక్.. దాడికి కారణం ఇదేనట.. !

Sharath

Updated On : October 19, 2021 / 2:13 PM IST

సుఖీభవ ఫేమ్ శరత్‌పై జరిగిన దాడి.. సంచలనమైంది. ఈ విషయమై స్పందించిన శరత్.. తనపై జరిగిన దాడికి కారణాలను మీడియాకు వెల్లడించాడు. తనపై హిజ్రాలు దాడి చేయలేదని.. గతంలో తాను దాడి చేసిన వాళ్లే.. ఇప్పుడు సమయం చూసుకుని మరీ తనపై తీవ్రంగా దాడి చేశారని చెప్పి.. షాక్ కు గురి చేశాడు.

అసలు విషయం ఏంటంటే.. గతంలో తన చెల్లిని కొందరు వేధించారట. వారిపై శరత్ దాడి చేశాడట. అప్పుడు కేసు నమోదై.. తాను జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు హైదరాబాద్ లోని నల్లగుట్టకు చెందిన శరత్ గుర్తు చేసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక.. తనకు పాపులారిటీ వచ్చిందని చెప్పిన శరత్.. 2, 3 సినిమా అవకాశాలు కూడా వచ్చాయన్నాడు.

తన ఎదుగుదలను ఓర్వలేకనే.. తన ప్రత్యర్థులు అదును చూసి దాడి చేశారని శరత్ చెప్పాడు. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.

Read More:

Sukhibhava Sharath : అయ్యయ్యో.. ‘సుఖీభవ’ కుర్రాడిపై దాడి.. దారుణంగా కొట్టారు