Bigg Boss 7 : బిగ్‌బాస్ లోకి తల్లీకూతుళ్లు.. నిజమేనా? సురేఖావాణి.. సుప్రీత..?

బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

Bigg Boss 7 : బిగ్‌బాస్ లోకి తల్లీకూతుళ్లు.. నిజమేనా? సురేఖావాణి.. సుప్రీత..?

Surekhavani Suprith will contest in Bigg Boss 7 Telugu rumors goes viral

Updated On : August 8, 2023 / 1:45 PM IST

Bigg Boss 7 : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో రానుంది. ఇటీవలే ఓ రెండు ప్రోమోలు రిలీజ్ చేసి ఆడియన్స్ కి షోపై కీరియాసిటి పెంచారు. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఈ సారి కూడా నాగార్జుననే(Nagarjuna) హోస్ట్ చేయనున్నారు.

అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్… అమరదీప్ – తేజస్విని జంట, సీరియల్ ఆర్టిస్ట్ శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, కార్తీకదీపం మోనిత.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ షో మొదలయ్యేవరకు కూడా ఫైనల్ కంటెస్టెంట్స్ పేర్లు అధికారికంగా బయటకు రావు.

తాజాగా ఈ లిస్ట్ లో మరో ఇద్దరి పేర్లు చేరాయి. టాలీవుడ్ ఫేమస్ తల్లీకూతుళ్లు సీనియర్ ఆర్టిస్ట్ సురేఖావాణి(Surekhavani), ఆమె కూతురు సుప్రీత(Supritha) ఈ సారి బిగ్‌బాస్ లోకి వస్తారని సమాచారం. సురేఖావాణి సినిమాలతో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఇక సుప్రీత సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. పలు ఆల్బమ్ సాంగ్స్ లో కనిపించింది సుప్రీత. ఇప్పటికే సురేఖ – సుప్రీత లు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అన్ని పోస్ట్ చేస్తూ కావాల్సినంత పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ తల్లీకూతుళ్ళిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పుడు వీరిద్దరూ బిగ్‌బాస్ లోకి వస్తారని అంటున్నారు. వీరిద్దరూ వస్తే షోకి మంచి హైప్ వస్తుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. త్వరలో సుప్రీత ఎలాగో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది కాబట్టి తనకి కూడా పాపులారిటీ కోసం మరింత బిగ్‌బాస్ ఉపయోగపడుతుందని, అందుకే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

Kushboo with her Daughters : కూతుళ్లతో కుష్బూ స్పెషల్ ఫోటోలు..

ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సెట్ వర్క్ పూర్తవుతుంది. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రారంభమవుతుందని సమాచారం.