Taliban Defence Minister: జైలు మాజీ ఖైదీయే అఫ్ఘాన్ రక్షణ మంత్రి

ప్రపంచంలోనే అత్యంత కరడుగట్టిన నేరగాళ్లు, అంతర్జాతీయ ఉగ్రవాదులను బంధీలుగా ఉంచిన స్థలం గ్వాంటెనామో జైలు ప్రాంతం. అటువంటి జైలులో శిక్ష అనుభవించిన ఉగ్రవాదిని అఫ్ఘాన్ రక్షణ మంత్రిగా...

Taliban Defence Minister: జైలు మాజీ ఖైదీయే అఫ్ఘాన్ రక్షణ మంత్రి

Afghan Defence Minister

Taliban Defence Minister: ప్రపంచంలోనే అత్యంత కరడుగట్టిన నేరగాళ్లు, అంతర్జాతీయ ఉగ్రవాదులను బంధీలుగా ఉంచిన స్థలం గ్వాంటెనామో జైలు ప్రాంతం. అటువంటి జైలులో శిక్ష అనుభవించిన ఉగ్రవాదిని అఫ్ఘాన్ రక్షణ మంత్రిగా నియమించారు. అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించి ప్రభుత్వ ఏర్పాటుదిశగా ముందుకు కదులుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దేశ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్‌ ఖయ్యూమ్‌ జకీర్‌ను అపాయింట్ అయ్యారు.

అఫ్ఘాన్‌ రక్షణ మంత్రిగా
తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ సన్నిహితుడు, ఉగ్రవాద సంస్థ వెటరన్‌ కమాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఖయ్యూమ్‌ జకీర్‌. అతణ్ని రక్షణమంత్రిగా నియమిస్తున్నట్లు తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయని ప్రముఖ న్యూస్‌చానల్‌ అల్‌‌జజీరా పేర్కొంది. అమెరికా బలగాలు జకీర్‌ను 2001లో బంధించాయి. అప్పటి నుంచి 2007 వరకు గ్వాంటెనామో జైలులో ఖైదీగా ఉన్నాడు. అనంతరం అతడిని అఫ్ఘాన్‌ ప్రభుత్వానికి అప్పగించాయి.

దేశంలో ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకాగా, తాలిబాన్లలోని అగ్రనేతలను అత్యున్నత హోదాల్లో ఉంచారు. సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ద అఫ్ఘానిస్థాన్‌ బ్యాంక్‌ (డీఏబీ) తాత్కాలిక అధినేతగా హాజీ మహమ్మద్‌ ఇద్రిస్‌ ఇప్పటికే బాధ్యతలు అందుకున్నారు.