Japan : తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్ జపాన్.. మన సినిమాలపై కోట్లు కురిపిస్తున్న జపాన్ అభిమానులు..

వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫాన్స్ పెరిగిపోవడంతో కోట్ల కాసులు కురిపించే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్. సౌత్ సినిమాకి బాలీవుడ్ లో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో ఇండియన్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా అలాంటి రెస్పాన్స్ అందుకుంటోంది. స్పెషల్లీ జపాన్ టాలీవుడ్ కి కాసులు కురిపించే కొత్త మార్కెట్ గా తయారైంది.

Japan : తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్ జపాన్.. మన సినిమాలపై కోట్లు కురిపిస్తున్న జపాన్ అభిమానులు..

Telugu Movies creates new Market in Japan telugu movies getting good collections in Japan

Telugu Movies in Japan : తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్ క్రియేట్ అవుతోంది. కొన్నాళ్ల వరకూ తెలుగు, ఆ తర్వాత సౌత్, రీసెంట్ గా బాలీవుడ్.. ఇలా ఒక్కో మార్కెట్ ని పెంచుకుంటూ పోతుంది తెలుగు సినిమా. ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. అందుకే కొత్తగా ఫారెన్ మార్కెట్లు ఓపెన్ అవుతున్నాయి. కలెక్షన్లతో సర్‌ప్రైజ్ చేస్తున్నాయి.

వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫాన్స్ పెరిగిపోవడంతో కోట్ల కాసులు కురిపించే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్. సౌత్ సినిమాకి బాలీవుడ్ లో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో ఇండియన్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా అలాంటి రెస్పాన్స్ అందుకుంటోంది. స్పెషల్లీ జపాన్ టాలీవుడ్ కి కాసులు కురిపించే కొత్త మార్కెట్ గా తయారైంది.

లేటెస్ట్ గా జపాన్ లో రిలీజ్ అయిన రంగస్థలం సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ తో ట్రెండ్ సెట్ చేసింది. ఫస్ట్ డేనే 15 లక్షల కలెక్షన్లతో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రంగస్థలం. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తాజాగా జపాన్ లో రిలీజయి జపాన్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. ట్రిపుల్ఆర్ తో అటు చరణ్ కి, పుష్పతో ఇటు సుకుమార్ కి గ్లోబల్ గుర్తింపు రావడంతో జపాన్ లో కూడా వీళ్లిద్దరి సినిమాలకి మంచి మార్కెట్ క్రియేట్ అవుతోంది.

సక్సెస్ తో పాటు కలెక్షన్ల స్టామినా కూడా ప్రూవ్ చేసుకున్న సినిమా ట్రిపుల్ఆర్. రాజమౌళి మేకింగ్ తో చరణ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన RRR సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురిపించింది. స్పెషల్లీ జపాన్ లో తెలుగు సినిమాకి పెద్ద మార్కెట్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 21, 2022లో జపాన్ లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ 200 రోజులకు పైగా ధియేటర్లో ఆడి 120 కోట్ల హయస్ట్ కలెక్షన్లతో సర్‌ప్రైజ్ చేసింది. జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది RRR. ఈ సినిమా టైమ్ లో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి డైరెక్ట్ ప్రమోషన్లతో అక్కడి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు.

Shahrukh Khan : సినిమా కలెక్షన్స్ పై షారుఖ్ పాత వీడియో వైరల్.. నాకన్ని తెలుసురా బాబు.. కలెక్షన్స్ గురించి మీరు చెప్పకండి..

ట్రిపుల్ ఆర్ కంటే ముందు బాహుబలి, సాహో సినిమాలు కూడా జపాన్ లో సత్తా చాటాయి. 2017 డిసెంబర్ 29న జపాన్ లో రిలీజ్ అయిన బాహుబలి అక్కడ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. బాహుబలి టైమ్ లో అక్కడ ప్రభాస్ కి ఫ్యాన్ క్లబ్ లు కూడా పెట్టారు. షియో ఫాంటసీని బాగా ఇష్టపడే జపాన్ ఆడియన్స్ బాహుబలికి తెగ ఇంప్రెస్ అయిపోయారు. దాంతో జపాన్ లో దాదాపు 20 కోట్ల కలెక్షన్ వచ్చింది బాహుబలికి. ఇలా తెలుగు సినిమాలకి వందల కోట్ల కలెక్షన్లతో సరికొత్త మార్కెట్ గా అవతరిస్తోంది జపాన్. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు జపాన్ లో డైరెక్ట్ రిలీజ్ కానున్నాయి.