Movie Shootings : షూటింగ్స్‌తో స్టార్స్ బిజీ..

సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తోంది టాలీవుడ్.. ఆల్‌మోస్ట్ అన్ని సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి.. ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్‌ని అందుకోడానికి షూటింగ్ చకచకా చేసేస్తున్నాయి..

Movie Shootings : షూటింగ్స్‌తో స్టార్స్ బిజీ..

Movie Shootings

Movie Shootings: సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తోంది టాలీవుడ్. ఆల్‌మోస్ట్ అన్ని సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్‌ని అందుకోడానికి షూటింగ్ చకచకా చేసేస్తున్నాయి. మరి ఏ హీరో షూటింగ్ స్టార్ట్ చేశారో, ఏ సినిమా ఏ సెట్లో ఉందో చూద్దాం.

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ మీదకెళుతున్నాయి సినిమాలు. రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ షూట్ గండిపేటలో షూటింగ్ స్టార్టవ్వడంతో సెట్లో చరణ్ దిగిన పిక్ వైరల్ అవుతోంది.

చిరంజీవి, చరణ్ జంటగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కూడా కోకాపేట్‌లో మొన్నటి నుంచే మొదలై, కంటిన్యూ అవుతోంది. మూడేళ్ల నుంచి చెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కూడా ఫైనల్ టచెస్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ చేశారు. జూలైలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘రాధే శ్యామ్’ అనుకున్న టైమ్‌కి సినిమా రిలీజ్ చెయ్యడానికి మిగిలిన షూట్‌ని ఫాస్ట్‌గా కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు.

నాని, రాహుల్ సంకృత్యాన్‌తో చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ సిబిఐటి కాలేజ్ ఏరియాలో వేసిన సెట్‌లో షూటింగ్ స్టార్ట్ చేసింది. నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ సికింద్రాబాద్‌లో జరుగుతుంది.

తమిళ్ హీరో విశాల్ కూడా తన 31 వ సినిమా షూటింగ్‌ని హైదారాబాద్‌‌లో మొదలుపెట్టారు. చెన్నైలో ఇంకా పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాని కంప్లీట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు విశాల్.  యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమా షామీర్‌పేట్‌లో జరుగుతుంది. ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన ‘పాగల్’ సినిమా త్వరగా థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటోంది.

వీళ్లతో పాటు మిగిలిన స్టార్ హీరోలు కూడా షూటింగ్ చెయ్యడానికి షెడ్యూల్స్ వేసుకున్నారు. బన్నీ -సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ షూటింగ్ జూలై అయిదు నుంచి భూత్ బంగ్లాలో జరుగబోతోంది. మహేష్, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ జూలై ఏడు నుంచి హైదరాబాద్‌లో షూట్ కంటిన్యూ చెయ్యబోతోంది.

పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్‌లో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియం రీమేక్ మూవీ జూలై ఫస్ట్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీ లో చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్3’ సినిమా షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగబోతోంది. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమా కూడా జూలై ఒకటి నుంచి గండిపేటలో 40రోజుల షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది.