Allu Arjun : మరోసారి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో.. ఈ సారి ఆహా కోసం.. ఏం ప్లాన్ చేశారో?

తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని విడుదల చేసింది ఆహా టీం. ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతుందని ప్రకటించింది.

Allu Arjun : మరోసారి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో.. ఈ సారి ఆహా కోసం.. ఏం ప్లాన్ చేశారో?

Trivikram and Allu Arjun Combo again for Aha OTT this time

Updated On : June 12, 2023 / 10:53 AM IST

Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ది సూపర్ హిట్ కాంబో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కొట్టారు ఇద్దరూ. ఈ ఇద్దరి కాంబోలో ఇంకో మూవీ ఉండబోతుందని గతంలోనే ప్రకటించారు. అయితే దానికంటే ముందే ఈ ఇద్దరి కాంబోలో ఇంకేదో రాబోతుంది. అది కూడా ఆహా(Aha) ఓటీటీ(OTT) కోసం. తెలుగులో దూసుకుపోతున్న ఆహా ఓటీటీ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. తాజగా అల్లు అర్జున్(Allu Arjun) తో ఆహా కొత్తగా ఏదో ప్లాన్ చేయబోతుంది.

తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని విడుదల చేసింది ఆహా టీం. ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతుందని ప్రకటించింది. దీంతో బన్నీతో ఏదైనా షో ప్లాన్ చేస్తున్నారా? లేకా ఆహా కోసం యాడ్ చేస్తున్నారా? లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ఓ ప్రాజెక్టు కోసం కలుస్తుండటంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

Thaman : తమన్ పై ట్రోల్స్.. మొదటిసారి స్పందించిన తమన్ భార్య.. భార్యగా బాధగా ఉంటుంది కానీ..

అయితే ఆహా రిలీజ్ చేసిన ఫోటో చూస్తుంటే గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్, శ్రీలీలకు సంబంధించిన ఫోటో కూడా ఇదే షూట్ నుంచి అని తెలుస్తుంది. అది యాడ్ అని అంతా అనుకున్నారు. ఆ ప్రాజెక్టు, ఇది ఒకటే అని వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ బట్టి తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్, శ్రీలీలతో త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేశాడబ్బా అని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ని #AAtakesoverAha అని ప్రమోట్ చేస్తున్నారు. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Trivikram and Allu Arjun Combo again for Aha OTT this time