Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం.. భక్తులకు శుభవార్త, ఆలయ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్

Ram Temple : 2024 డిసెంబర్ 30 నాటికి 1వ, 2వ అంతస్థులు పూర్తవుతాయి. 2025 డిసెంబర్ నాటికి పూర్తి ఆలయ సముదాయం సిద్ధమవుతుంది.

Ram Temple : అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి కీలక విషయాలు వెల్లడించారు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా. డిసెంబర్‌ లోగా రామమందిరం మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. రూ.1400 -1800 కోట్ల ఖర్చుతో ఆలయ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. డిసెంబర్ 30, 2023 నాటికి మొదటి దశ రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించిందన్నారు. ఆలయాన్ని మూడు దశల్లో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశ పూర్తయిన తర్వాతే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తామన్నారు.

” 2024 డిసెంబర్ 30 నాటికి 1వ, 2వ అంతస్థులు పూర్తవుతాయి. ప్రజలు డిసెంబర్ 30, 2023 నాటికి రాముడికి ప్రార్థనలు చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. మొదటి దశలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 5 మండపాలు, గర్భగుడి, విగ్రహ ప్రతిష్టాపన ఇతర పనులు పూర్తి చేస్తాం. 5 మండపాల నిర్మాణంలో దాదాపు 160 పిల్లర్లు ఉన్నాయి.

Also Read..Revanth Reddy : జంట నగరాలపై అణుబాంబే, హైదరాబాద్‌లో వేలాది మంది చనిపోయే పరిస్థితి వస్తుంది..! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పిల్లర్లపై శిల్పాలు, చిత్రాలు, చిహ్నాల పని పూర్తి చేయాలి. ఆలయ దిగువపీఠంపై శ్రీరాముని సంక్షిప్త వివరణ ప్రారంభించబడుతుంది. విద్యుత్ సౌకర్యం, ఇతర సౌకర్యాల పనులు మొదటి దశలో పూర్తి చేయాలి. ఆలయ బయటి ప్రాంగణం సహా మొదటి, రెండవ అంతస్తులు 2024 డిసెంబర్ 30 నాటికి పూర్తవుతాయి. 2025 డిసెంబర్ నాటికి పూర్తి ఆలయ సముదాయం సిద్ధమవుతుంది” అని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు