మీరు శాపగ్రస్తులయ్యారా? వివిధ శాపాలు ఇవే.. ఇందులో..

పరాశర మహర్షి తన "బృహత్పరాశర హోరాశాస్త్రంలో “పూర్వజన్మ శాపద్యోతక' అనే శీర్షికలో అంతర్గత భాగంగా ఎనిమిది విధాలైన శాపాలను వివరించారు.

మీరు శాపగ్రస్తులయ్యారా? వివిధ శాపాలు ఇవే.. ఇందులో..

Updated On : November 30, 2025 / 9:49 PM IST

Kaal Sarp Dosh: జీవితంలో మన కార్యవ్యవహారాలు, ఆచరణలు, విద్య, మరణం, ఉద్యోగము, వివాహము, సంతానము, రుణాలు మొదలగునవి అన్నింటినీ జాతక చక్రము వివరిస్తుంది.

జాతకచక్రంలో గ్రహస్థితి పరిశీలన వల్ల పూర్వ జన్మ విషయాలన్నీ అవగతమవుతాయి. పరాశర మహర్షి తన “బృహత్పరాశర హోరాశాస్త్రంలో “పూర్వజన్మ శాపద్యోతక’ అనే శీర్షికలో అంతర్గత భాగంగా ఎనిమిది విధాలైన శాపాలను వివరించారు. అవి. 1) సర్పశాపం 2) పితృశాపం 3) మాతృశాపం 4) భ్రాతృశాపం 5) మాతులశాపం 6) బ్రహ్మశాపం 7) భార్యశాపం 8) ప్రేతశాపం.

పరాశర మహర్షి వివరించిన శాపాలు

దేవదేవ జగన్నాథ శూలపాణే వృషవాహ
తేనయోగేన మర్త్యానాం జాయతే శిశునాశనం॥
తత్సర్వమత్ర యోగేన బ్రూహి మే శశిశేఖర
శాప మోక్షం కృపయాప్రాణినామల్పమేథనామ్

పార్వతిదేవి పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది హే! వృషవాహనా, శూలపాణీ, జగన్నాయకా! ఏ యోగం చేత మర్త్యలోకంలో సంతానహాని కలుగుతుంది? శశిశేఖరా! తమరు సిద్ధయోగులు అజ్ఞాననులైన మానవుల శాపాన్ని నివారించగల ఉపాయమును చెప్పండి అని. అప్పుడు పరమశివుడు.. దేవి నీవు మంచి ప్రశ్న అడిగావు వివరిస్తాను వినుము అంటూ శాపముల గురించి వివరించాడు.