Strange Thieves : ఇంట్లో చోరీ చేసిన బంగారాన్ని యజమానికి ‘కొరియర్’ ద్వారా పంపించిన దొంగలు

ఇంట్లో చోరీ చేసిన బంగారాన్ని తిరిగి యజమానికి కొరియర్ ద్వారా పంపించారు దొంగలు. దీంతో ఇంటి యజమానితో పాటు పోలీసులు కూడా షాక్ అయ్యారు.

Strange Thieves : ఇంట్లో చోరీ చేసిన బంగారాన్ని యజమానికి ‘కొరియర్’ ద్వారా పంపించిన దొంగలు

Strange Thieves In UP

Strange Thieves In UP : ఇంట్లో చోరీ చేసిన బంగారమైనా,డబ్బు అయినా ఇతర విలువైన వస్తువులు ఏవైనా సరే ఇక తిరిగి దొరటం అనేది జరుగదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన చోరీ జరిగిన సొత్తు తిరిగి పొందటం అనేది కల్ల అనే చెప్పాలి. కానీ ఓ ఇంట్లో భారీగా బంగారం చోరీ జరిగింది. ఆ బంగారం మాత్రం యజమానికి తిరిగి సురక్షితంగా లభించింది. ఇదే పెద్ద విశేషం అనుకుంటే..షాక్ అయ్యే మరో విశేషమేమంటే.. ఇంట్లోకి చొరబడి చోరీ చేసిన దొంగలే స్వయంగా తాము దోచుకెళ్లిన బంగారాన్ని ‘కొరియర్’ద్వారా సదరు యజమానికి పంపించారు..! వింటేనే షాకింగ్ గా ఉందికదూ..భలే భలే దోచుకెళ్లిన సొత్తును పైగా బంగారాన్ని యజమానికి తిరిగి సురక్షితంగా పంపించారు అంటే ఆ దొంగలు చాలా మంచిదొంగల్లా ఉన్నారేఅనిపిస్తోంది కదూ..మనకే ఇలా ఉంటే ఇక బంగారం పోగొట్టుకున్న యజమాని ఈ ఊహించని పరిణామం గురించి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు దొంగతనం చేశాడో? మళ్లీ ఎందుకు ఆ సొత్తును వెనక్కి పంపాడో తెలియక ఆ ఇంటి యజమాని బుర్రలు వాచిపోయేలా ఆలోచించాడు. అతనితో పాటు ఈ బంగారం చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కూడా బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ ఘటనలోకి వెళితే..

ఘజియాబాద్‌లో పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగర్ ఎక్స్‌టెన్షన్ పరిధిలో ఫార్చూన్ రెసిడెన్సీ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న ప్రీతి సిరోహి అనే టీచర్ దీపావళి పండుగ జరుపుకోవటానికి అక్టోబరు 23న తన సొంత గ్రామం బులంద్‌షహర్ వెళ్లారు. అక్టోబరు 27న సాయంత్రం తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడం, కబోర్డ్స్ తెరిచి ఉండడంతో దొంగలు దోచుకుపోయారు అని తెలుసుకోవటానికి ఎంతోసేపు పట్టలేదు. రూ. 25 వేల నగదుతో పాటు 14 లక్షల విలువైన మాయమైనట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆమె పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సొసైటీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ దొంగ సదరు టీచర్ ఇంట్లోకి చొరబడినట్టు అందులో రికార్డయింది. కేసు దర్యాప్తులో ఉండగానే నాలుగు రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ప్రీతికి పార్సిల్ వచ్చింది. అందులో ఏముందోనని భయపడిన ప్రీతి దానిని పోలీసులకు అప్పజెప్పారు.

పోలీసులు ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో చోరీకి గురైన బంగారు ఆభరణాల్లో కొన్ని ఉన్నాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. తన నగలను గుర్తించిన సదరు టీచర్ అయితే షాక్ నుంచి కోలుకోవటానికి కాస్త టైమ్ పట్టింది. డీటీడీసీ కొరియర్‌లో వచ్చిన ఆ పార్సిల్‌లో ప్రీతి పేరు, ఫ్లాట్ నంబరు, మొబైల్ నంబరు ఉండడంతో ఆమె ఆశ్చర్యపోయారు. దొంగ తిరిగి పంపిన బంగారు ఆభరణాల విలువ రూ. 4 నుంచి ఐ లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

అంతేకాదు..ఆ బాక్స్‌లోనే ఉన్న మరో చిన్న బాక్స్‌లో ఆ రోజు ఎత్తుకెళ్లిన రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు కూడా ఉన్నాయి. హపూర్‌లోని రాజ్‌దీప్ జువెల్లర్స్ నుంచి బాక్స్ వచ్చినట్టు ఉండడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మరోసారి షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఆ పేరుగల షాపు లేదని తెలుసుకుని తిరిగి వచ్చారు. కొరియర్ తీసుకున్న సంస్థ సిబ్బందిని విచారించగా..ఇద్దరు మగపిల్లలు వచ్చి దానిని బుక్ చేశారని చెప్పారు. దీంతో పంపిన వారు ఎవరై ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.