Saamanyudu : ఒక నేరస్థుడు ఎలా పుట్టుకొస్తాడో తెలుసా?..

విశాల్ మార్క్ కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘సామాన్యుడు’..

Saamanyudu : ఒక నేరస్థుడు ఎలా పుట్టుకొస్తాడో తెలుసా?..

Saamanyudu Trailer

Updated On : January 19, 2022 / 6:20 PM IST

Saamanyudu: తను నటించే ప్రతి సినిమాలోనూ కొత్తదనం, చేసే క్యారెక్టర్‌లో వైవిధ్యం చూపించాలని కోరుకునే నటుడు విశాల్. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ డిఫరెన్స్ చూపిస్తూ.. హీరోగా తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రత్యేకమైన గుర్తింపు, మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట!

విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’.(Not A Common Man).. డింపుల్ హయతి కథానాయిక. యోగిబాబు కీలకపాత్రలో కనిపించనున్నాడు. సొంత బ్యానర్‌ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ నిర్మిస్తున్నాడు. శరవణన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!

బుధవారం సాయంత్రం ‘సామాన్యుడు’ ట్రైలర్ వదిలారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా మీద అంచనాలు పెంచింది. విశాల్ మార్క్ కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘సామాన్యుడు’ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్, కవిన్ రాజ్ విజువల్స్ బాగున్నాయి. సినిమా త్వరలో తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది.