Vivo Y33e 5G : వివో Y33e 5G బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Vivo Y33e 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కంపెనీ Y33 సిరీస్ కొత్త బడ్జెట్ ఫోన్ ప్రవేశపెట్టింది. చైనాలో సొంత మార్కెట్లో Vivo Y33e 5G బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది.

Vivo Y33e 5G : వివో Y33e 5G బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Vivo Y33e 5g Budget Smartphone Launched Specs, Price, And Other Details

Updated On : June 1, 2022 / 10:13 PM IST

Vivo Y33e 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కంపెనీ Y33 సిరీస్ కొత్త బడ్జెట్ ఫోన్ ప్రవేశపెట్టింది. చైనాలో సొంత మార్కెట్లో Vivo Y33e 5G బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన Vivo Y33s 5G ఫోన్‌కు ఇది టోన్ డౌన్ వెర్షన్. సరసమైన ధరకే Vivo Y33e 5G సపోర్ట్‌తో వచ్చింది. MediaTek డైమెన్సిటీ ప్రాసెసర్, లేటెస్ట్ Android 12తో వచ్చింది. Vivo Y33e స్మార్ట్ ఫోన్లో 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్‌ వచ్చింది. దీని ధర RMB 1,299.. అంటే దాదాపు రూ. 15,000గా ఉంటుంది.

ఈ జూన్‌ నుంచి చైనాలో ఈ బడ్జెట్ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు గ్లోబల్ లభ్యత వివరాలను ఇంకా వెల్లడించలేదు. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Vivo Y33e 5G 6.51-అంగుళాల HD+ డిస్ప్లేతో వాటర్‌డ్రాప్ నాచ్ ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇందులో మైక్రో SD కార్డ్ ఆప్షన్ కూడా ఉంది.

Vivo Y33e 5g Budget Smartphone Launched Specs, Price, And Other Details (1)

Vivo Y33e 5g Budget Smartphone Launched Specs, Price, And Other Details

Vivo Y33e 5G బాక్స్‌లో ప్రామాణిక 10W ఛార్జింగ్ సపోర్టు అందించనుంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు కూడా అందిస్తుంది. ఇందులోని సాఫ్ట్‌వేర్ సరికొత్త Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆధారంగా OriginOS Ocean UIలో రన్ అవుతుంది. కెమెరాల పరంగా.. ఫోన్‌లో 13-MP ప్రైమరీ సెన్సార్, 2-MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్ 8-MP షూటర్‌తో వచ్చింది. USB-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, WiFi, బ్లూటూత్ 5.1, డ్యూయల్-సిమ్ GPS వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read Also : Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!