Vivo Y75 Smartphone : 50MP కెమెరాతో వివో కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Vivo Y75 Smartphone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది.

Vivo Y75 Smartphone : 50MP కెమెరాతో వివో కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Vivo Y75 Launched In India With 44 Megapixel Selfie Camera, 44w Fast Charging Price, Specifications

Vivo Y75 Smartphone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. కొత్త Vivo Y75 44-MP సెల్ఫీ కెమెరాతో పాటు 50-MP వెనుక కెమెరా ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఫోటోగ్రఫీ ఇష్టపడేవారిని ఈ స్మార్ట్ ఫోన్ మరింత ఆకర్షించేలా ఉంది. ఇక ఈ ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఎక్కువగా ట్రావెల్స్ చేసేవారైతే వివో Y75 స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. Vivo 2022 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు, X80, X80 ప్రోలను భారత మార్కెట్లో ఆవిష్కరించిన వెంటనే Y75 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. Samsung Galaxy S22 Ultra, Apple iPhone 13లకు టాప్-ఎండ్ Vivo X80 Pro పోటీగా ప్రవేశపెట్టింది కంపెనీ. కానీ, టాప్-ఎండ్ ఫీచర్లు Vivo Y75 మాదిరి కాకుండా అధిక ధర కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా.. అతి తక్కువ ధరకే యూజర్లను ఆకట్టుకునేలా స్పెసిఫికేషన్‌లతో వచ్చింది.

ఇండియాలో Vivo Y75 ధర ఎంతంటే? :
మూన్‌లైట్ షాడో డ్యాన్సింగ్ వేవ్స్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది. అందులో యూనిక్ వేరియంట్ Vivo V75 ధర రూ. 20,999గా ఉంది. Y75 స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్, Vivo ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. మే 31, 2022లోపు కొనుగోలు చేస్తే.. మంచి ఆఫర్ కూడా ఉంది. ICICI బ్యాంక్, SBI, IDFC ఫస్ట్ బ్యాంక్ OneCard కార్డ్‌ని ఉపయోగించి.. మీరు రూ. 1,500 వరకు అడ్వాన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది.

Vivo Y75 Launched In India With 44 Megapixel Selfie Camera, 44w Fast Charging Price, Specifications (1)

Vivo Y75 Launched In India With 44 Megapixel Selfie Camera, 44w Fast Charging Price, Specifications

Vivo Y75 స్పెసిఫికేషన్స్ ఇవే :
Vivo Y75 2.5D ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, నారో బెజెల్ డిస్‌ప్లే కలిగిన మిడ్-రేంజ్ ఫోన్. 6.44-అంగుళాల FullHD AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. కంటెంట్ వినియోగం కోసం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ డిస్‌ప్లే అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇవ్వకపోవడం గమనార్హం. Vivo Y75 స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్, 4G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 5G సపోర్టు చేయదు. ఫోన్ మైక్రో SD కార్డ్‌కు సపోర్టుతో పాటు 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగిస్తుంది. ఈ ఫోన్ 4GB వరకు డైనమిక్ RAM ఎక్స్ ప్యాండబుల్ కూడా సపోర్టు ఇస్తుంది.

Vivo Y75లో 3 కెమెరాలు ఉన్నాయి. 50-MP ప్రైమరీ కెమెరా, 8-MP వైడ్ యాంగిల్ కెమెరా, 2-MP సూపర్ మాక్రో కెమెరా ఉన్నాయి. Vivo ఫోన్ కెమెరాలో AI-ఆధారిత ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుందని పేర్కొంది. 44-MP కెమెరా అతిపెద్ద హైలైట్‌గా చెప్పవచ్చు. AI ఫేస్ బ్యూటీ, స్టెడిఫేస్ సెల్ఫీ, వీడియో ఫేస్ బ్యూటీ, పిక్చర్-ఇన్-పిక్చర్ డ్యూయల్ వ్యూ వంటి ఫీచర్లతో వచ్చింది. Vivo Y75 4050mAh బ్యాటరీతో 44W స్పీడ్‌తో ఛార్జ్ అవుతుంది.

Read Also : Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?