5 Common Habits : ఈ 5 సాధారణ అలవాట్లు స్మోకింగ్‌ కన్నా చాలా డేంజర్.. తప్పక తెలుసుకోండి.. వెంటనే మార్చుకోండి!

స్మోకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే అంతకంటే ఎక్కువ ప్రమాదం కలిగించే అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్ల బారినపడితే అంతే.. కోలుకోవడం కష్టమేనంటున్నారు మానసిక నిపుణులు. ప్రపంచంలో స్మోకింగ్ చేసేవారిలో 12శాతం కన్నా ఎక్కువ మంది మన భారతదేశంలోనే ఉన్నారు.

10TV Telugu News

5 Common Habits as Dangerous as Smoking : స్మోకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే అంతకంటే ఎక్కువ ప్రమాదం కలిగించే అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్ల బారినపడితే అంతే.. కోలుకోవడం కష్టమేనంటున్నారు మానసిక నిపుణులు. ప్రపంచంలో స్మోకింగ్ చేసేవారిలో 12శాతం కన్నా ఎక్కువ మంది మన భారతదేశంలోనే ఉన్నారు. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్‌లోమాత్రమే ప్రతి ఏడాదిలో 10 మిలియన్ల మంది పోగ అలవాటు కారణంగా మరణిస్తున్నారు.

ఈ రోజుల్లో యువతలో స్మోకింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకసారి ఈ అలవాట్ అయితే వ్యసనపరుడిగా మార్చేస్తుంది.. చివరికి మరణానికి దారితీస్తుంది. అయితే ఈ స్మోకింగ్ అలవాట్ల కంటే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు చాలానే ఉన్నాయి. అందులో తరచుగా ఈ అలవాట్లను పెద్దగా పట్టించికోరు. స్మోకింగ్ వల్ల ఎలాగైతే ఆరోగ్యానికి హాని కలుగుతుందో అంతే స్థాయిలో ఈ 5 అలవాట్లు కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఐదు అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం..

ఒంటరితనం (Loneliness) :
దీర్ఘకాలిక ఒంటరితనం.. ఇదొక్కటి చాలు.. ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి.. అనేక పరిశోధనలో ఇదే రుజువైంది కూడా. దీని ప్రభావం మెదడు ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఒంటరితనం కారణంగా అల్జీమర్స్ వంటి వ్యాధులతో సంబంధాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలో దాదాపు 22శాతం పెద్దలు ఒంటరిగా ఉంటున్నారు. యువతలో, దీర్ఘకాలిక ఒంటరితనం మరింత ఆందోళనకరంగా మారింది.

హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం (Poor diet) :
ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరం.. కానీ, మనలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోరు. మనలో చాలామంది ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, ఉప్పు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటారు. అంతేకాదు.. మనం తరచుగా కూరగాయలు, పండ్లను మన ఆహారంలో చేర్చుకోరు. ఈ అలవాటు కారణంగా ఊబకాయం, డయాబెటిస్ వంటి అనేక వ్యాధులు వస్తాయి. భారత్ లో ప్రజలు ఎక్కువ తృణధాన్యాలు తీసుకుంటారు. తగినంత మొత్తంలో ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు తీసుకోరు. పురుషులు, స్త్రీలలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం పెరిగిపోతోంది.

వ్యాయామం లేని జీవనశైలి (Inactive lifestyle) :
ఉరుకుల పరుగుల జీవితం.. గంటల కొద్ది కంప్యూటర్ల ముందే కూర్చొంటుంటారు. కొంచెం కూడా వ్యాయామం చేయరు. అటు ఇటూ నడవరు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. జర్మనీలోని రీజెన్స్‌బర్గ్ యూనివర్శిటీలో 2014లో జరిపిన అధ్యయనంలో ప్రతి 2 గంటలకు ఒక వ్యక్తి కూర్చుని, పెద్దప్రేగు కాన్సర్ వచ్చే అవకాశాలను 8శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలను 6శాతం పెరుగుతున్నట్టు తేలింది.

నిద్ర లేమి (Sleep deprivation) :
అదే పనిగా స్క్రీన్ చాలా గంటలు కూర్చుని చూడటం వల్ల నిద్ర లేమికి దారితీస్తుంది. స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి కారణంగా కళ్ళు ఒత్తిడికి లోనవడం, స్పష్టమైన దృష్టి లేకపోవడం, కంటిశుక్లం వంటి సమస్యలు రావొచ్చు. దేశంలో దాదాపు 33శాతం పెద్దలు నిద్రలేమితో బాధపడుతున్నారు. అసలు పెద్ద సమస్య ఏమిటంటే.. అదంతా సాధారణమైనదిగా భావిస్తారు. అసలే పట్టించికోరు.. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

నిరాశావాదం (Pessimistic attitude) :
ఒక వ్యక్తిలో నెగటివ్ వ్యక్తిత్తం.. వారి జీవితాన్ని నాశనం చేయగలదని గుర్తించుకోండి. ప్రతికూల వైఖరి, నిరాశావాదం అనేది పెద్ద సమస్యగా మారింది. నిరాశావాదంతో జీవించేవారిలో ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు కలుగుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. తమ అంచనాలు తప్పు అవుతాయని, తమపై తాము అపనమ్మకంతో జీవిస్తుంటారు. ఫలితంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశతో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

ఈ ఐదు చెడు అలవాట్లు స్మోకింగ్ వలె ప్రమాదకరమైనవిగా మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నెగటివ్ యాటిట్యూడ్ వదులుకోండి. రోజూ కంటినిండా బాగా నిద్రపోండి, రోజువారీ జీవితంలో మరింత యాక్టివ్‌గా ఉండండి. సమతుల్య ఆహారం తీసుకోండి.. సంతోషంగా గడపండి.. మీరు ఈ 5 అలవాట్లను ఎంత తొందరగా వదిలేస్తే.. అంత తొందరగా మీ మనస్సు, శరీరంలో పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు.

10TV Telugu News