Cool Drinks : కూల్ డ్రింక్స్ తాగుతున్నారా!..అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?..

కూల్‌డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది.

Cool Drinks : కూల్ డ్రింక్స్ తాగుతున్నారా!..అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?..

Cool Drink1

Cool Drinks : ఇటీవలి కాలంలో నీటికి బదులుగా కూల్ డ్రింక్స్ తాగే అలవాటు పెరిగిపోయింది. ఇక వేసవి కాలంలో చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కూలిడ్రింక్స్ సీసాల కొద్దీ తాగేస్తుంటారు. తిన్నది అరిగించుకునేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ ను అదేపనిగా తాగుతుంటారు. ఇలా తీసుకుంటే అనారోగ్యసమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. కూల్ డ్రింక్స్ లో ఉండే రసాయనాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ శరీరంలో కాల్సియం లోపించేలా చేస్తుంది. అంతే కాదు దంతాలను బలహీనంగా మారుస్తుంది. ఎముకలతో పాటు కండరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. హార్మోన్ల సతుల్యత ఏర్పడటం కారణంగా లైంగిక వాంచలు తగ్గిపోతాయి. కూల్ డ్రింక్స్ శరీరాన్ని చల్లబర్చటానికి బదులుగా ఆసిడ్ స్ధాయిలను పెంచి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

350మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ లో 35 నుండి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన ఐదు నిమిషాల్లో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహం బారిన పడే అవకాశాలను 67% వరకూ కొని తెచ్చుకున్నట్లేనని చెప్పవచ్చు.ఇందులో ఉండే బ్రోమినేటెడ్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ అనే రసాయనానికీ నాడీ నష్టానికీ సంబంధం ఉంది. ఈ రసాయనంతో చర్మం మీద దద్దుర్లు కూడా తలెత్తుతాయి.కూల్‌ డ్రింక్స్‌ నిల్వ కోసం వాడే ఫాస్ఫేట్స్‌, ఫాస్ఫారిక్‌ యాసిడ్లు చర్మపు సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా తక్కువ వయసులోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తాం.

కూల్‌డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది.కూల్‌ డ్రింక్‌ తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్లు 30% పెరగుతాయి. ఇవి గుండె రక్తనాళాలను గట్టిపరుస్తాయి.కూల్ డ్రింక్స్ లో కూడా కాఫీలో ఉండే కెఫిన్ ఉంటుంది. అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమౌతాయి.