Vaibhav Suryavanshi : బ్యాటుతో బుడ్డోడి విధ్వంసం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. డివిలియర్స్ వరల్డ్ రికార్డు బద్దలు..

Vaibhav Suryavanshi : దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ బుధవారం మొదలైంది. బీహార్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi : బ్యాటుతో బుడ్డోడి విధ్వంసం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. డివిలియర్స్ వరల్డ్ రికార్డు బద్దలు..

Vaibhav Suryavanshi

Updated On : December 24, 2025 / 11:29 AM IST

Vaibhav Suryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిక్సులు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ రికార్డులు బద్దలు కొట్టాడు.

Also Read : Gold and silver prices : వామ్మో.. ఒక్కోరోజే రూ.10వేలు జంప్.. బంగారం కొనుగోలుపై బ్యాకింగ్ నిపుణులు కీలక అప్‌డేట్..

దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 (Vijay Hazare Trophy)  సీజన్ బుధవారం మొదలైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్ తరపున ఆడిన సూర్యవంశీ బ్యాటుతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఫలితంగా సరికొత్త రికార్డును సృష్టించాడు.


టాస్ గెలిచిన బీహార్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో మంగళ్ మహ్‌రౌర్ 43బంతుల్లో 33 పరుగులుచేసి నిష్ర్కమించగా.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించిన సూర్యవంశీ.. 84 బంతుల్లో 190 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. కేవలం 36 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో సరికొత్త మైలురాయిని వైభవ్ అందుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (Fastest Century)ల జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ కోరే ఆండర్సన్‌, గ్రాహమ్‌ రోస్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.

ఇక సెంచరీ తర్వాత కూడా తన జోరును కొనసాగించిన వైభవ్‌ సూర్యవంశీ.. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 64 బంతుల్లోనే 150 పరుగులు చేసిన సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.