Gold and silver prices : వామ్మో.. ఒక్కోరోజే రూ.10వేలు జంప్.. బంగారం కొనుగోలుపై బ్యాకింగ్ నిపుణులు కీలక అప్‌డేట్..

Gold and silver prices : బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold and silver prices : వామ్మో.. ఒక్కోరోజే రూ.10వేలు జంప్.. బంగారం కొనుగోలుపై బ్యాకింగ్ నిపుణులు కీలక అప్‌డేట్..

Gold And Silver Prices,

Updated On : December 24, 2025 / 10:19 AM IST

Gold and silver prices : బంగారం, వెండి ధరలు చూస్తుంటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. రోజురోజుకు వీటి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఎవరూ ఊహించని స్థాయికి ధరలు చేరుకుంటున్నాయి. దీంతో న్యూఇయర్, సంక్రాంతి పండుగలకు బంగారం, వెండి కొనుగోలుకు ప్లాన్ చేసుకున్న వారికి ప్రస్తుతం ధరలు బిగ్ షాకిస్తున్నాయని చెప్పొచ్చు.

Also Read : ISRO: ఇస్రో మరో ఘనత.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్

బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 380 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 63 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,497 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 10వేలు పెరిగింది. దీంతో కిలో వెండి రేటు రూ.2,44,000వేలకు చేరింది. గడిచిన మూడ్రోజుల్లోనే కిలో వెండిపై రూ. 18వేలు పెరుగుదల చోటు చేసుకోవటం గమనార్హం.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ఇటీవల తగ్గించగా.. మళ్లీ వచ్చే ఏడాది కూడా వరుస సమీక్షల్లో తగ్గించనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, లేబర్ మార్కెట్ కూడా బలంగా ఉండటం దీనికి కారణం. ఇంకా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వల్ని పెంచుకుంటుండటం సహా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తుండటం కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు విపరీతంగా పెరిగేందుకు దారి తీస్తోంది.

ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు కలిసి బంగారానికి మద్దతు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరెన్సీ విలువల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణగా బంగారం ఎప్పటికీ కీలక పాత్ర పోషిస్తుందని, అయితే పరిస్థితులు మారితే ధరల్లో కొంతకాలం స్థిరత్వం లేదా స్వల్ప హెచ్చుతగ్గులు ఉండొచ్చని హెచ్చరించారు. అయితే, 10 గ్రాములకు 1.34లక్షల కంటే దిగువకు వస్తే లాభాల బుకింగ్ కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,27,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,38,930కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,500 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,39,080కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,27,350 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,38,930కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,33,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,44,000 వద్దకు చేరింది.
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.