Vijay – Rashmika : ఇటు విజయ్.. అటు రష్మిక.. రాబోయే సినిమాల్లో రక్తపాతమే..
రష్మిక చివరగా థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో హిట్స్ కొట్టింది. విజయ్ కింగ్డమ్ సినిమాతో పర్లేదనిపించాడు. (Vijay - Rashmika)
Vijay Deverakonda Rashmika Mandana
Vijay – Rashmika : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కొన్ని రోజుల క్రితం సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట డేటింగ్ చేస్తున్నారు. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది. విజయ్ మాత్రం చాలా కష్టపడుతున్నా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.(Vijay – Rashmika)
రష్మిక చివరగా థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో హిట్స్ కొట్టింది. విజయ్ కింగ్డమ్ సినిమాతో పర్లేదనిపించాడు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ చేస్తున్న సినిమాలపై ఒక్కసారిగా అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ఇందులో విజయ్ దేవరకొండ కత్తి పట్టుకొని అందర్నీ నరుకుతూ రక్తపాతంలో మునిగి తేలాడు.
Also Read : TastyTeja : అది కనక జరిగి ఉంటే ఇమ్మాన్యుయేల్ విన్నర్.. బిగ్ బాస్ పై టేస్టీ తేజ కామెంట్స్ వైరల్..
దీంతో ఇదేదో ఫుల్ మాస్ సినిమాగా వర్కౌట్ అయ్యేలా ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే విజయ్ ఇలా రక్తపాతం చూపిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసిన రెండు రోజులకే రష్మిక కూడా తన మాస్ చూపించింది.
One NAME.
One intent.
One impact that travels across languages. 💥💥💥#RowdyJanardhana Title Glimpse is out in all languages and is creating havoc 🪓🔥▶️ https://t.co/a2bXI9LAzk@TheDeverakonda @keerthyofficial @storytellerkola #ChristoXavier #AnendCChandran @DinoShankar… pic.twitter.com/ogKwhduwQ5
— Sri Venkateswara Creations (@SVC_official) December 23, 2025
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ గా గోండు జాతి బ్యాక్ డ్రాప్ లో మైసా సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా ఇందులో రష్మిక రక్తంతో తడిసి గన్ పట్టుకొని తనపైకి వచ్చేవాళ్లను చంపుతున్నట్టు చూపించారు. ఇందులో రష్మిక పోరాటాలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. రష్మిక కూడా ఒళ్ళంతా రక్తంతో కనపడింది. దీంతో ఓ పక్క విజయ్, మరో పక్క రష్మిక ఇద్దరూ తమ మాస్ సినిమాలతో ఈసారి బ్లడ్ బాత్ చూపించబోతున్నారని తెలుస్తుంది. మరి మైసా, రౌడీ జనార్దన్ సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.
Also Read : Ravi Babu : రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. భయపడేవాళ్లు చూడొద్దు.. టైటిల్ ఏంటంటే..?
Against every odd, she rises.
Against silence, she roars.
Against the world, she stands alone.🔥#RememberTheName – She is #MYSAA ❤️🔥First Glimpse out now 💥
— https://t.co/Pm1H851PzBIn cinemas 2026 🔥@iamRashmika @rawindrapulle @jakes_bejoy @kshreyaas #AndyLong… pic.twitter.com/vPisTX6NUh
— UnFormula Films (@unformulafilms) December 24, 2025
