Ravi Babu : రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. భయపడేవాళ్లు చూడొద్దు.. టైటిల్ ఏంటంటే..?
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా రవిబాబే నటిస్తున్నట్టు తెలుస్తుంది. (Ravi Babu)
Ravi Babu
Ravi Babu : కమెడియన్ గా, విలన్ గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు దర్శకుడిగా కూడా మొదట్నుంచి కొత్త కొత్త కథలతో మెప్పిస్తున్నాడు. అల్లరి, అనసూయ, నచ్చావులే, నువ్విలా, అమరావతి, అవును, ఆవిరి, క్రష్.. లాంటి డిఫరెంట్ కాన్సెప్తులతో సినిమాలు ఈసీ హిట్స్ కొట్టి ప్రేక్షకులను మెప్పించాడు. డైరెక్టర్ గా కొంత గ్యాప్ తీసుకున్న రవిబాబు ఇటీవల మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు.(Ravi Babu)
కొన్ని రోజుల క్రితమే ఏనుగుతొండం ఘటికాచలం అనే సినిమాతో ఈటీవీ విన్ ఓటీటీలో పలకరించాడు రవిబాబు. తాజాగా రవిబాబు కొత్త సినిమాను ప్రకటిస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాడు. రవిబాబు కొత్త సినిమా పేరు ‘రేజర్’ అని ప్రకటించాడు. ఈ టైటిల్ గ్లింప్స్ లో మనుషులను ముక్కలు ముక్కలుగా నరికేసినట్టు చూపించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా రవిబాబే నటిస్తున్నట్టు తెలుస్తుంది.
Also Read : Murari Working Stills : మురారి రీ రిలీజ్.. మహేష్ బాబు అప్పటి వర్కింగ్ స్టిల్స్ చూశారా.. ఫొటోలు వైరల్..
ఇక ఈ రేజర్ సినిమాని సమ్మర్ 2026 లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు నెలకొల్పిన రవిబాబు సినిమా ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి. మీరు కూడా రవిబాబు కొత్త సినిమా రేజర్ టైటిల్ గ్లింప్స్ చూసేయండి..
