Causes Of Overweight : అధిక బరువుకు అనేక కారణాలు! అవగాహన పెంచుకోవటం ద్వారా..

బరువు తగ్గాలంటే ఆహారం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. తక్కువ కెలొరీలు అందుతాయి. కానీ దానివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందువు. వాస్తవానికి ఏదయినా పదార్థం తీసుకునే ముందు మోతాదు కన్నా నాణ్యత గురించి ఆలోచించాలి. కేవలం కెలొరీలనే పరిగణించకుండా ఒక పదార్థం తినడం వల్ల అందే పోషకాలపై దృష్టిపెట్టాలి.

Causes Of Overweight : అధిక బరువుకు అనేక కారణాలు! అవగాహన పెంచుకోవటం ద్వారా..

overweight

Causes Of Overweight : మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి కారణాలవుతాయి. అధిక బరువు శారీరక రోగాలకు దారితీస్తుంది. అధిక బరువుకు అసలు కారణాలు ఏంటన్న విషయం చాలా మందికి తెలియదు. పెరిగిన బరువు తగ్గాలన్న ప్రయత్నాలు చేస్తుండటమే తప్ప మూలాలు కనుగొని సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం మాత్రం చేయరు. దీంతో బరువు సమస్య శాశ్వితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికబరువుకు అసలు కారణాల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం.

నిద్రలేమితో అధిక బరువు ; నిద్రలేమి జీవక్రియల వేగాన్ని తగ్గిస్తుంది. ఆకలి హార్మోన్లుగా పరిగణించే లెప్టిన్‌, గ్రెలిన్‌పై ప్రభావం చూపుతుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు లెప్టిన్‌… తినడం ఆపమంటూ మెదడుకి సంకేతాలనిస్తుంది. గ్రెలిన్‌ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది. అధ్యయనాల ప్రకారం నిద్రలేమి వల్ల లెప్టిన్‌ పనితీరు తగ్గుతుంది. అదే బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందుకే వేళకు నిద్రపోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి.

చక్కెర తీసుకుంటే : కాఫీ, టీల్లో చక్కెర ఎక్కువగా వేసుకోకపోవచ్చు. మిఠాయిలు మానేయొచ్చు. కానీ శీతల పానీయాలూ, సాస్‌ల్లో చక్కెరలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పళ్ల సమస్యలూ, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి దాడిచేస్తాయి. బరువూ పెరుగుతారు. కాబట్టి వాటిని కొనేముందు పదార్థాలపై రాసున్న వివరాలను చదవాలి. చక్కెర శాతం ఎక్కువ అని రాసి ఉన్న వాటిని మానేయాలి. నేరుగా చక్కెర అని రాయకపోవచ్చు కానీ.. సుక్రోస్‌, గ్లూకోజ్‌, ఫ్రక్టోస్‌, మాల్టోస్‌, ఫ్రూట్‌జ్యూస్‌ కాన్‌సన్‌ట్రేట్‌ అని రాసి ఉంటాయి. వీటి శాతం కాస్త ఎక్కువగా ఉన్నా చక్కెర ఉన్నట్టే.

కెలొరీలు లెక్కిస్తున్నారా: బరువు తగ్గాలంటే ఆహారం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. తక్కువ కెలొరీలు అందుతాయి. కానీ దానివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందువు. వాస్తవానికి ఏదయినా పదార్థం తీసుకునే ముందు మోతాదు కన్నా నాణ్యత గురించి ఆలోచించాలి. కేవలం కెలొరీలనే పరిగణించకుండా ఒక పదార్థం తినడం వల్ల అందే పోషకాలపై దృష్టిపెట్టాలి. సమృద్ధిగా పోషకాలనందించే వాటినే ఎంచుకోవాలి. ముఖ్యంగా విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ యాక్సిడెంట్లూ అందించే పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాల్ని తీసుకోవాలి. ఇంట్లో వండిన పదార్థాలను తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్‌ఫుడ్‌ బరువు పెరిగేందుకు కారణం అవుతుందని గుర్తించాలి.

హార్మోన్ల సమస్యలు: హైపోథైరాయిడిజం, పీసీఓడీ లాంటివన్నీ హార్మోన్ల పనితీరులో మార్పుల వల్లే ఎదురవుతాయి. వీటివల్ల త్వరగా బరువు పెరుగుతారు. తిరిగి తగ్గడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యను నిర్ధరించుకునే ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ఏ ఒక్క సమస్య ఉందని తేలినా శుద్ధిచేసిన పిండిపదార్థాలను మానేసి మేలుచేసే ప్రొటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కూరగాయలూ, అత్యవసరమైన ఫ్యాటీ ఆమ్లాలూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.