Unwanted Hair : అవాంఛిత రోమాలు తొలగించుకునే న్యాచురల్ రెమిడీస్!

గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ చక్కెర, అర-టీస్పూన్‌ కార్న్‌ఫ్లోర్ లను ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా తయారైన పేస్ట్ ను రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి.

Unwanted Hair : అవాంఛిత రోమాలు తొలగించుకునే న్యాచురల్ రెమిడీస్!

Unwanted Hair

Unwanted Hair : మహిళల్లో హార్మోన్స్ ప్రభావంతో ముఖంపై వెంట్రుకలు వస్తుంటాయి. చాలా మంది మహిళల్లో ఇలా ముఖంపై వెంట్రుకలు రావటం చూస్తుంటాం. కొన్ని రకాల మందులు, ఊబకాయం, హార్మోనుల లోపం ఇవన్నీ ముఖంపై వెంట్రుకలు రావటానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ అవాంఛిత రోమాలు చూసేవారికి వికారంగా కనిపిస్తుంటాయి. వీటిని తొలగించుకునేందుకు చాలా మంది ఆధునిక పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే మనకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతోనే అవాంఛిత రోమాలను సులభంగా తొలగించు కోవచ్చు. ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించే న్యాచురల్ రెమిడీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముఖంపై ఉండే అవాంఛితరోమాలను తొలగించాలంటే పసుపు, శెనగపిండి, వేపాకు పొడి, పచ్చి పాలు మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చేతి వేళ్ళతో మృధువుగా మర్ధనా చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ చక్కెర, అర-టీస్పూన్‌ కార్న్‌ఫ్లోర్ లను ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా తయారైన పేస్ట్ ను రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి. కాసేపటి తర్వాత వ్యతిరేక దిశలో లాగేస్తే అవాంఛిత రోమాలు ఊడిపోతాయి.

ఒక స్పూన్ తేనెలో అరటీ స్పూన్‌ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల అవాంఛిత రోమాల పెరుగుదల తగ్గుతుంది.

బొప్పాయి పండును గుజ్జులా చేసుకోవాలి. అందులో టీస్పూన్‌ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు ఉన్న చోట మృదువుగా రుద్దాలి. కొంతసమయం తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల రోమాల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

చాలా మంది మహిళలకు అప్పర్ లిప్స్ పై మీసాల్లా కనిపిస్తుంటాయి. వీటిని తొలగించుకునేందుకు పసుపు, పెరుగు, బియ్యంప్పిండి మూడు కలిపి ఫెస్ ఫ్యాక్ తయారు చేసుకుని అప్లై చేయాలి. 15 నిమిషాలు తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. వారానికి ఒకసారి చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

పుదీనా ఆకులతో టీ తయారు చేసుకుని ప్రతిరోజు రెండు కప్పుల చొప్పున తీసుకోవటం వల్ల మహిళల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుంది. అంతేకాకుండా అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. ఇతర సమస్యలకు పుదీనా మంచి ఔషదంగా పనిచేస్తుంది.