Venu Udugula : సాయి పల్లవి నేను ఎవరో తెలీదు అంది.. విరాట పర్వం ఆ హీరో చేయాల్సింది..
తాజాగా 10 టీవీకి ఇచ్చిన విరాట పర్వం సినిమా ఎలా ఓకే అయిందో చెప్తూ ఆసక్తికర విషయం తెలిపారు.(Venu Udugula)
Venu Udugula
Venu Udugula : నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో దర్శకుడిగా ఫేమ్ తెచ్చుకున్న వేణు ఉడుగుల ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో నిర్మాతగా హిట్ కొట్టారు. వేణు ఉడుగుల తాజాగా 10 టీవీకి ఇచ్చిన విరాట పర్వం సినిమా ఎలా ఓకే అయిందో చెప్తూ ఆసక్తికర విషయం తెలిపారు.(Venu Udugula)
Also Read : Ariyana Glory : రాజకీయాల్లోకి వస్తా.. పాదయాత్ర చేస్తా.. నేను సీఎం అయితే.. అరియనా కామెంట్స్ వైరల్..
వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా హిట్ అయి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో చాలా మంది నిర్మాతలు ఫోన్స్ చేసారు, అవకాశాలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారు అంటే వుమెన్ సెంట్రిక్ చేయాలి, సాయి పల్లవి లాంటి అమ్మాయితో చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పటికి విరాట పర్వం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నా నెక్స్ట్ సినిమా సాయి పల్లవితో అని రాసేశారు వార్తల్లో. అది సాయి పల్లవి దాకా వెళ్ళింది.
ఆమెని పడిపడి లేచే మనసు సినిమా ప్రమోషన్స్ లో వేణు ఉడుగులతో సినిమా చేస్తున్నారట అని అడిగితే ఎవరు అతను, నాకు తెలీదు అని చెప్పింది. పక్కనే శర్వానంద్ ఉంటే ఇతను మంచి డైరెక్టర్ అని నా గురించి చెప్పాడు. అప్పుడే శర్వానంద్ సుధాకర్ చెరుకూరి గారికి చెప్పి అడ్వాన్స్ ఇప్పించారు. కథ చెప్పిన పది నిమిషాల్లో చెక్ ఇచ్చారు. వారం రోజుల్లో ఆఫీస్ ఓపెన్ చేసాము. ఇంకో వారం రోజుల్లో సాయి పల్లవితో మీటింగ్ ఇప్పిస్తే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసారు. మలయాళం హీరో నివిన్ పోలికి విరాట పర్వం కథ చెప్తే ఓకె చేసాడు. కానీ అనుకోకుండా సురేష్ బాబుకి కథ చెప్తే రానాకి చెప్పామన్నారు. దాంతో రానా ఓకే చేసాడు. అలా ఆ సినిమా రానాతో తెరకెక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు అంటారు కానీ బ్రేక్ ఈవెన్ అయింది, సేల్ అయింది. డబ్బులు వచ్చాయి. కాకపోతే అనుకున్నంత విజయం సాధించలేదు అని ఫీల్ అయ్యాను అని తెలిపారు.
Also Read : Venu Udugula : తెలంగాణ అంటే తాగుడే చూపిస్తున్నారు.. అలాంటి సినిమాలపై వేణు అడుగుల కామెంట్స్..
