Venu Udugula : తెలంగాణ అంటే తాగుడే చూపిస్తున్నారు.. అలాంటి సినిమాలపై వేణు అడుగుల కామెంట్స్..
తాజాగా వేణు ఉడుగుల దీనిపై మాట్లాడారు. (Venu Udugula)
Venu Udugula
Venu Udugula : నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో దర్శకుడిగా ఫేమ్ తెచ్చుకున్న వేణు ఉడుగుల ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో నిర్మాతగా హిట్ కొట్టారు. ఈ సినిమా సక్సెస్ అనంతరం వేణు ఉడుగుల తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ కల్చర్ సినిమాల గురించి మాట్లాడారు.(Venu Udugula)
ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని సినిమాల్లో తెలంగాణ కల్చర్ అంటే ముందు తాగడం, నాన్ వెజ్ తినడమే అన్నట్టు చూపిస్తున్నారు. దాన్ని గొప్పగా చెప్తున్నారు. దీనిపై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా వేణు ఉడుగుల దీనిపై మాట్లాడారు.
Also Read : Suresh Babu : తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా సురేష్ బాబు.. నాగవంశీకి కీలక భాద్యత..
వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని సినిమాల్లో తెలంగాణ అంటే తాగుడే చూపిస్తున్నారు. తెలంగాణ అంటే బోటి కూర, నల్లి బొక్క దగ్గర గొడవలు పడటం, పెళ్లిలో కొట్లాటలు చూపిస్తున్నారు. అలాంటివి అక్కడక్కడా జరుగుతూ ఉంటాయి కానీ అవే జరగవు. అది మన కల్చర్ కాదు. ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ కల్చర్ కి అంత ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు తెలంగాణ కల్చర్, భాష, యాస కి మార్కెట్ ఉంది. సినిమాల్లో ఏ కల్చర్ చూపిస్తే అదే ఆ ప్రాంతం కల్చర్ అనుకుంటారు. వేళ్ళు చూపించేది తప్పు అని అన్నారు.
దీంతో వేణు ఉడుగుల కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి తెలంగాణ అంటే తాగుడే అన్నట్టు రిప్రజెంట్ చేస్తున్న కొంతమంది నెటిజన్లు, అలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళు దీనిపై స్పందిస్తారేమో చూడాలి.
Also Read : Ariyana Glory : అతను 8 లక్షలు మోసం చేసాడు.. నాకు ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి.. అరియనా కామెంట్స్..
