Ariyana Glory : అతను 8 లక్షలు మోసం చేసాడు.. నాకు ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి.. అరియనా కామెంట్స్..

ఈ క్రమంలో తన ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చింది.(Ariyana Glory)

Ariyana Glory : అతను 8 లక్షలు మోసం చేసాడు.. నాకు ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి.. అరియనా కామెంట్స్..

Ariyana Glory

Updated On : December 28, 2025 / 6:30 PM IST

Ariyana Glory : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియనా తర్వాత సోషల్ మీడియా, బిగ్ బాస్, పలు టీవీ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా అరియనా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తన ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చింది.(Ariyana Glory)

Also Read : Ariyana Glory : బిగ్ బాస్ లో నా వీపు కాలిపోయింది.. నా కెరీర్ అయిపోయింది..

అరియనా మాట్లాడుతూ.. గతంలో రెండు రిలేషన్ షిప్స్ బ్రేక్ అయ్యాయి. నా లైఫ్ లోకి ఒక ఇద్దర్ని సెలెక్ట్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్ చెప్పారు వీడు నీకు కరెక్ట్ కాదు అని కానీ తర్వాత తెలిసింది. నా రిలేషన్ షిప్ విషయంలో నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. నేను ఒక మంచి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. నా లైఫ్ లోకి ఎవరో ఒకరు మ్యాజిక్ జరిగి రావాలి. నేను సెలెక్ట్ చేసుకుంటే అది అవ్వట్లేదు. నాకు ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి.

నన్ను అర్ధం చేసుకోవాలి, నా వాడు అనిపించాలి. కానీ అలాంటివాళ్ళు దొరక్క సింగిల్ గా ఉన్నాను. మా ఇంట్లో నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నేను ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల వరకు మోసం చేసాడు అతడు. తమ్ముడు అనుకున్న ఒక అబ్బాయి డబ్బుల విషయంలో మోసం చేసాడు. అందుకే ఎవర్ని తొందరగా నమ్మట్లేదు. డబ్బుల దగ్గర మోసం చేస్తే ఏం బాగుపడతారు. కర్మ ఉంటుంది. ఒకసారి 6 లక్షలు అవసరం వచ్చింది కానీ అప్పుడు ఎవరూ నిలబడలేదు. అవసరం వచ్చినప్పుడు వదిలేసారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Ariyana Glory : శివాజీ గారి ఉద్దేశం కరెక్ట్.. శివాజీకి సపోర్ట్ చేసిన అరియనా..