Ariyana Glory : రాజకీయాల్లోకి వస్తా.. పాదయాత్ర చేస్తా.. నేను సీఎం అయితే.. అరియనా కామెంట్స్ వైరల్..
ఈ క్రమంలో తనకు పాలిటిక్స్ మీద ఉన్న ఆసక్తి గురించి తెలిపింది అరియనా.(Ariyana Glory)
Ariyana Glory
Ariyana Glory : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియనా తర్వాత సోషల్ మీడియా, బిగ్ బాస్, పలు టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా అరియనా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తనకు పాలిటిక్స్ మీద ఉన్న ఆసక్తి గురించి తెలిపింది.(Ariyana Glory)
Also Read : Ariyana Glory : అతను 8 లక్షలు మోసం చేసాడు.. నాకు ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి.. అరియనా కామెంట్స్..
అరియనా గ్లోరీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో గల్లీ కౌన్సిలర్ అన్నా, ఎమ్మెల్యే అయినా అయ్యేలా చూడు అని దేవుడ్ని దండం పెట్టుకుంటాను. నేను పాలిటిక్స్ లోకి రావాలి అనుకుంటున్నాను. నాకు కనీసం మా తాండూర్ లో గల్లీ కౌన్సిలర్ అయినా అవ్వాలని నా కోరిక. నేను పాదయాత్ర కూడా చేస్తా. నా పరిధిలో ఉన్న ప్లేస్ వరకు నేను మంచి చేస్తా. అక్కడ ఉండే లేడీస్ కి ఏం కావాలి, ఆ కాలనీకి ఏం కావాలి చూసుకుంటా. నేను సీఎంకు అయితే 50 వేలు కంటే బ్యాంక్ లో తక్కువ ఉన్న అందరి అకౌంట్స్ లోకి పది లక్షలు చొప్పున వేస్తా. లైఫ్ అంతా కష్టపడుతూ ఉంటారు, కనీసం ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలి. అందుకే వేస్తాను అని తెలిపింది. మరి నిజంగానే భవిష్యత్తులో అరియనా రాజకీయాల్లోకి వస్తుందేమో చూడాలి.
