RGV : ఆర్జీవీని డీల్ చేయలేను అన్నారు..మూడు సార్లు రిజెక్ట్ చేసారు.. ఆర్జీవీ ఇంటర్వ్యూపై అరియనా కామెంట్స్..

అరియనాతో జిమ్ సెటప్ లో, జిమ్ డ్రెస్ లో కాస్త అడల్ట్ గా కనిపించేలా ఇంటర్వ్యూ చేసారు.(RGV)

RGV : ఆర్జీవీని డీల్ చేయలేను అన్నారు..మూడు సార్లు రిజెక్ట్ చేసారు.. ఆర్జీవీ ఇంటర్వ్యూపై అరియనా కామెంట్స్..

RGV

Updated On : December 28, 2025 / 9:51 PM IST

RGV : యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియనా కరోనా ముందు ఆర్జీవీతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో బాగా వైరల్ అయింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీని అరియనా ఇంటర్వ్యూ చేసింది. ఆర్జీవీ ఇంటర్వ్యూలు అంటే మాములుగా ఉండవని తెలిసిందే గా. అరియనాతో జిమ్ సెటప్ లో, జిమ్ డ్రెస్ లో కాస్త అడల్ట్ గా కనిపించేలా ఇంటర్వ్యూ చేసారు.(RGV)

దాంతో ఆ ఇంటర్వ్యూ, అరియనా రెండూ వైరల్ అయ్యాయి. పలువురు ఈ ఇంటర్వ్యూపై విమర్శలు కూడా చేసారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరియనా దీనిగురించి మాట్లాడింది.

Also Read : Venu Udugula : సాయి పల్లవి నేను ఎవరో తెలీదు అంది.. విరాట పర్వం ఆ హీరో చేయాల్సింది..

అరియనా మాట్లాడుతూ.. నేను ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయాలని ఎప్పుడో టార్గెట్ పెట్టుకున్నా. అది అనుకున్న సంవత్సరం తర్వాత ఛాన్స్ వచ్చింది. ఒక సినిమాకు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయమని వచ్చింది. సరే అని రామానాయుడు స్టూడియోకి వెళ్తే నేను చిన్నపిల్లలా కనిపించాను వాళ్లకు. చిన్నపిల్లలా ఉంది, సన్నగా ఉన్నాను ట్యాలెంట్ లేదు, ఆర్జీవిని డీల్ చేయలేదు అని పంపించేశారు. నేను బాధపడ్డా.

రెండో సారి కూడా ఛాన్స్ వచ్చింది కానీ ఆ రోజు ఆర్జీవీ అనుకోకుండా రాలేదు. దాంతో క్యాన్సిల్ అయింది ఆ ఇంటర్వ్యూ కూడా. మూడో సారి ఛాన్స్ వస్తే అప్పుడు కూడా చాలా సన్నగా ఉన్నావు, నువ్వు డీల్ చేయలేవు అని పక్కనపెట్టి వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించారు. దాంతో చాలా బాధపడ్డాను. నేను ఇంక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయాలనే టార్గెట్ వదిలేసా. కరోనా వచ్చే ముందు నాలుగో సారి ఛాన్స్ వచ్చింది. ఇన్ని సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఈసారి కూడా రిజెక్ట్ చేస్తారేమో అని మొదట నో చెపుదాం అనుకున్నా. కానీ ఓకే చెప్పి ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూ వల్లే నాకు ఫేమ్ వచ్చింది, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అని తెలిపింది.

Also Read : Ariyana Glory : రాజకీయాల్లోకి వస్తా.. పాదయాత్ర చేస్తా.. నేను సీఎం అయితే.. అరియనా కామెంట్స్ వైరల్..