Bigg Boss Contestants : బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్?
బిగ్‌బాస్ 5 తెలుగు ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో దీనిపై చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందనే దానికంటే కూడా అందులో ఎవరెవరు పాల్గొంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Contestants : బిగ్‌బాస్ 5 తెలుగు ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో దీనిపై చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందనే దానికంటే కూడా అందులో ఎవరెవరు పాల్గొంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో పాల్గొనబోయే 16 మంది పేర్లు వైరల్ అవుతున్నాయి.
సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారనే దానిపై సోషల్‌మీడియాలో చర్చ సాగుతోంది. ఈ సీజన్ కంటెస్టెంట్ల పేరుతో ఒక లిస్టు కూడా వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకారం యాంకర్ రవి, షణ్ముఖ జస్వంత్, ఆర్జే కాజల్, నీనియర్ నటి ప్రియ, సిరి హన్ముంతు, 7 ఆర్ట్స్ సరయు, నవ్య స్వామి, కార్తీక దీపం ఫేమ్ ఉమ, కమెడియన్ లోబో, టీవీ నటుడు మానస్, మోడల్ జస్వంత్, టీవీ నటుడు సన్నీ, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, ప్రియాంక (ట్రాన్స్ జెండర్), న్యూస్ రీడర్ ప్రత్యూష, ఆట సందీప్/ రఘు మాస్టర్ ఉన్నారు.