Bimbisara Collections: బింబిసార 2 రోజుల కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఫాంటెసీ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడం, సినిమా కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమా బాకక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌గా అవతరించింది.

Bimbisara Collections: బింబిసార 2 రోజుల కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్!

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చూపడం ఖాయమని చిత్ర యూనిట్ మొదట్నుండీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇక ఫాంటెసీ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడం, సినిమా కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమా బాకక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌గా అవతరించింది.

Bimbisara 1st Day Collections: బింబిసార ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం.. టెర్రిఫిక్ స్టార్ట్!

తొలిరోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.7.08 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టడంతో రిలీజ్ అయిన తోలిరోజే ఈ సినిమాకు సగం వసూళ్లు వచ్చేశాయి. ఇక రెండో రోజు కూడా బంబిసారుడు బాక్సాఫీస్ వద్ద తన దూకుడు ప్రదర్శించాడు. ఈ సినిమా రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు ముగిసేసరికి రూ.12 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Bimbisara: బింబిసార సక్సెస్.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠానికి గురిచేసింది. ఇక ఈ సినిమా యూనిట్ ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలిపారు. కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను నందమూరి అభిమానులతో పాటు ఇతర ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3.92 కోట్లు
సీడెడ్ – 2.24 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.55 కోట్లు
ఈస్ట్ – 0.70 కోట్లు
వెస్ట్ – 0.55 కోట్లు
గుంటూరు – 0.89 కోట్లు
కృష్ణా – 0.59 కోట్లు
నెల్లూరు – 0.38 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ 2 డేస్ కలెక్షన్స్ – 10.82 కోట్లు
ఇతర ప్రాంతాలు – 0.60 కోట్లు
ఓవర్సీస్ – 1.05 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.12.37 కోట్లు