ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత..

  • Published By: vamsi ,Published On : November 4, 2020 / 03:32 PM IST
ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత..

Kola Bhaskar : దక్షిణాది సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమా ఎడిటర్ కోలా భాస్కర్ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలా భాస్కర్ (Kola Bhaskar ) గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇవాళ(4 నవంబర్ 2020) ఉదయం 8 గంటలకు చనిపోయారు. కోలా భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు. కోలా భాస్కర్ కు భార్య, కుమారుడు ఉన్నారు. కోలా భాస్కర్ తెలుగులో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు.




పవన్ కళ్యాణ్ హీరోగా.. భూమిక హీరోయిన్‌గా సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషీ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. 7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలకు పనిచేశాడు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కోలా భాస్కర్ ఎడిటర్‌గా పనిచేశాడు.
https://10tv.in/pawan-kalyan-replace-to-balakrishna/
కోలా భాస్కర్ కుమారుడు కోలా బాలకృష్ణ కూడా సినిమా రంగంలోనే నటుడిగా రాణిస్తున్నారు. హీరోగా నిన్ను వదిలి నేనుపోలేనులే అనే సినిమాను చేశాడు. సెల్వ రాఘవణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని కోలా భాస్కర్ స్వయంగా నిర్మించాడు.




చిత్తూరులో జన్మించిన కోలా భాస్కర్‌ ‘ఖుషి’ (2001) సినిమాతోనే ఎడిటర్‌గా కెరీర్‌ ఆరంభించారు. ఆపై తమిళంలో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల కోసం పనిచేశారు. ‘7జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘పోక్కిరి’ (‘పోకిరి’ రీమేక్‌), ‘వర్ణ’, ‘3’, ‘యుగానికి ఒక్కడు’ తదితర సినిమాలకు పనిచేశారు.