బిగ్ బాస్ 3 : హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన హిమజ

హిమ‌జ బిహేవియర్ చూసి షాక్ అయిన ఇంటి సభ్యులు.. సీక్రెట్ టాస్క్‌లో హిమ‌జ ఫెయిల్  అయింద‌ని కన్ఫమ్ చేసిన బిగ్ బాస్..

  • Published By: sekhar ,Published On : August 24, 2019 / 05:40 AM IST
బిగ్ బాస్ 3 : హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన హిమజ

హిమ‌జ బిహేవియర్ చూసి షాక్ అయిన ఇంటి సభ్యులు.. సీక్రెట్ టాస్క్‌లో హిమ‌జ ఫెయిల్  అయింద‌ని కన్ఫమ్ చేసిన బిగ్ బాస్..

బిగ్ బాస్ 3 : గత ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. పున‌ర్న‌వి, శ్రీముఖిల‌ని కన్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి వారి వెనుక మిగ‌తా వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో చూపించాడు. ముందుగా పున‌ర్న‌విని పిలిచిన బిగ్ బాస్.. వితికా, వ‌రుణ్‌, రాహుల్‌లు పున‌ర్న‌వి గురించి మాట్లాడిన క్లిప్పింగ్ చూపించాడు. అది చూసి పున‌ర్న‌వి తెగ ఫీల్ అయిపోయింది తర్వాత శ్రీముఖిని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిల‌వ‌గా, ఆమెకి పునర్నవి, రాహుల్, వితికాలు తన వెనక ఎలా కామెంట్స్ చేశారో వీడియో ప్లే చేసి చూపించడంతో శ్రీముఖి చాలా ఫీలైంది.

అలీకి బాబా భాస్క‌ర్ ఎమోష‌న‌ల్ వీడియో చూపించగా.. అలీ ఎమోషనల్ అయ్యాడు. త‌న వల్ల ఏడ్చినందుకుగానూ బాబా భాస్కర్‌కి సారీ చెప్పాడు అలీ. అలాగే హిమ‌జ సీక్రెట్ టాస్క్ చేయాల‌ని, ఈ టాస్క్‌లో హౌస్‌మేట్స్ ఎవ‌రినీ మ‌న‌శ్శాంతిగా ఉంచ‌కూడ‌దు, ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్‌ని చెడ‌గొట్టాలి.. ఇలా చేస్తే నీకు ఇమ్యూనిటీ వ‌స్తుంది అని బిగ్ బాస్ చెప్పడంతో, హిమజ తన స్టైల్‌లో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసింది. ప్లేట్ ఎత్తి కింద పడెయ్యడం.. ట్రేలో ఉన్న ఎగ్స్ అన్నీ నేల‌కేసి కొట్టడంతో.. హిమ‌జ బిహేవియర్ చూసి అందరూ షాక్ అయ్యారు.

Read Also : సాహో : సెన్సార్ రిపోర్ట్..

ఎందుకిలా చేస్తున్నావని ఎవరైనా అడుగుదామని ట్రై చేసినా వారికి ఆ అవకాశం ఇవ్వకుండా రచ్చ రంబోలా చేసింది. చివరకు సీక్రెట్ టాస్క్‌లో హిమ‌జ ఫెయిల్  అయింద‌ని బిగ్ బాస్ కన్ఫమ్ చేశాడు. ఇక రాహుల్ సిప్లిగంజ్ బ‌ర్త్ డే కావడంతో బిగ్ బాస్ కేక్ పంపించగా.. రాహుల్ కేక్ క‌ట్ చేసాడు.. రాహుల్‌కి అంద‌రూ కేక్ తినిపించి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. వీకెండ్ కావడంతో ఈ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున కనిపించనున్నాడు. ఏడుగురు కంటిస్టెంట్స్‌లో ఇద్దరిని సేఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది.