Mahesh Babu Pet Dog : మహేష్ బాబు ఇంట్లో ప్లూటో చనిపోయింది.. స్నూపీ వచ్చింది..

తాజాగా నమ్రత తన ఇంట్లోకి మరో పెంపుడు కుక్క వచ్చినట్టు తెలిపింది. తన కొత్త పెంపుడు కుక్క ఫోటో షేర్ చేసి..

Mahesh Babu Pet Dog : మహేష్ బాబు ఇంట్లో ప్లూటో చనిపోయింది.. స్నూపీ వచ్చింది..

Mahesh Babu Welcomes new Pet Dog Snoopy into his Home

Updated On : September 8, 2023 / 6:34 AM IST

Mahesh Babu Pet Dog : మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Kaaram) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. ఇటీవల మహేష్ ఇంట్లో తన పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మహేష్ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు(Dog) ఉన్నాయి. అందులో ప్లూటో(Pluto) అనే కుక్క ఒకటి. ఇటీవల ప్లూటో చనిపోయిందని మహేష్ భార్య నమ్రత(Namrata) తన సోషల్ మీడియాలో తెలిపింది. ప్లూటోని చాలా మిస్ అవుతున్నాం అంటూ సితార(Sitara), మహేష్ కూడా పోస్ట్ చేశారు. మహేష్ ఇలా కుక్కతో ఉన్న ఫోటో పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

Mahesh Babu : తన పెంపుడు కుక్క చనిపోయిందని మహేష్ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా నమ్రత తన ఇంట్లోకి మరో పెంపుడు కుక్క వచ్చినట్టు తెలిపింది. తన కొత్త పెంపుడు కుక్క ఫోటో షేర్ చేసి.. ప్లూటోనే నిన్ను పంపించింది అనుకుంటున్నాము. మా ఫ్యామిలీలోకి వెల్కమ్ స్నూపీ(Snoopy) అని పోస్ట్ చేసింది. దీంతో మహేష్ అభిమానులు కూడా వెల్కమ్ స్నూపీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు స్నూపీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.