‘రాజా నరసింహా’గా మమ్ముట్టి ‘మధుర రాజా’

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో ఈ నెల 22న విడుదల కానుంది..

  • Edited By: sekhar , November 6, 2019 / 08:13 AM IST
‘రాజా నరసింహా’గా మమ్ముట్టి ‘మధుర రాజా’

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో ఈ నెల 22న విడుదల కానుంది..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో డబ్ అవుతోంది. మోహన్ లాల్ ‘మన్యంపులి’ ఫేమ్ వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు విలన్‌గా నటించిన ఈ సినిమాను.. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్‌ రిలీజ్ చేశారు. ‘చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఈ రాజా, రాజా బ్యాచ్‌ స్టాంగ్‌ అని. డబుల్‌ స్ర్టాంగ్‌ కాదు.. ట్రిపుల్‌ స్ర్టాంగ్‌’ అంటూ మమ్ముట్టి చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Read Also : అర్జున్ కపూర్‌తో రకుల్ ప్రీత్

సన్నీలియోన్‌ స్పెషల్ సాంగ్ చేసింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.. ఈ నెల 22న ‘రాజా నరసింహా’ విడుదల కానుంది. సంగీతం : గోపి సుందర్, కెమెరా : షాజీ కుమార్, ఎడిటింగ్ : మహేష్ నారాయణన్, సునీల్ యస్ పిళ్లై.