VirataParvam : 'లేడీ పవర్ స్టార్' బిరుదుపై స్పందించిన సాయిపల్లవి.. | Sai pallavi responds on lady powerstar name

VirataParvam : ‘లేడీ పవర్ స్టార్’ బిరుదుపై స్పందించిన సాయిపల్లవి..

విరాటపర్వం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ''నన్ను లేడీ పవర్ స్టార్ అంటూ ఎవరైనా అంటే నాకే కొంచెం అతిగా అనిపిస్తుంది..................

VirataParvam : ‘లేడీ పవర్ స్టార్’ బిరుదుపై స్పందించిన సాయిపల్లవి..

Sai Pallavi :  జూన్ 17న రానా, సాయి పల్లవి కలిసి నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి క్రేజ్ మీదే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి గురించి, ఆమె క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో, ఇప్పుడు విరాటపర్వం ప్రమోషన్స్ లో ప్రతి సారి సాయిపల్లవి క్రేజ్ ప్రూవ్ అవుతూనే వస్తుంది.

గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవి క్రేజ్ ని ఉద్దేశించి సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని బిరుదు ఇచ్చేశారు. ఇక అప్పట్నుంచి చాలా చోట్ల సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అనడం మొదలుపెట్టారు. అందుకు తగ్గట్టే ఆమె ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకి ఇచ్చిన “లేడీ పవర్ స్టార్” బిరుదు గురించి మాట్లాడింది.

Virata Parvam : సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. విరాటపర్వంపై ఎఫెక్ట్??

విరాటపర్వం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ”నన్ను లేడీ పవర్ స్టార్ అంటూ ఎవరైనా అంటే నాకే కొంచెం అతిగా అనిపిస్తుంది. నిజానికి నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు. నేను ఇక్కడ అందరితో గౌరవంగా పని చేయడానికి వచ్చాను. కానీ ఇలా సపరేట్ గా స్టార్ డం చూపిస్తుంటే నచ్చట్లేదు” అని తెలిపింది.

×