Virata Parvam : సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. విరాటపర్వంపై ఎఫెక్ట్??

ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.............

Virata Parvam : సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. విరాటపర్వంపై ఎఫెక్ట్??

Sai Pallavi

Sai Pallavi :  రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17 న రిలీజ్ కి రెడీగా ఉండటంతో వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి సాయి పల్లవే ప్లస్ అవ్వనుంది. తన క్రేజ్ మీదనే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సాయి పల్లవి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇంటర్వ్యూలో టాపిక్ నక్సల్స్, వయోలెన్స్, విరాటపర్వం ఇలా మాట్లాడుతూ హింస, మంచితనం వైపు టాపిక్ మారింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ”నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్‌లా అనిపిస్తారు. ఎందుకంటే మనం హార్మ్ చేస్తామనుకుంటారు. మనకు వాళ్లు అలా కనిపిస్తారు. నాకు వయలెన్స్ అనేది నచ్చదు. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడం కష్టం. మా ఫ్యామిలీ లెఫ్ట్, రైట్ అని ఉండదు. న్యూట్రల్‌గా చూసే ఫ్యామిలీలో పెరిగాను. అందులో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని చెప్పలేను. మనం మంచిగా ఉండి, ఎవరిని హార్ట్ చేయకుండా ఉంటే చాలు” అంది.

అయితే అసలు వివాదం కాశ్మీర్ ఫైల్స్, కాశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యల గురించి మాట్లాడటంతో మొదలైంది. సాయి పల్లవి.. ”కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. వాళ్లు అందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము. రీసెంట్‌గా ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు. అందులో డ్రైవర్ ముస్లిం అతను ఉన్నాడు. కొంత మంది అతన్ని కొట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే, ఇతరులను బాధించకుండా ఉంటే, లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మంచిగానే ఉంటుంది” అని అంది.

Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్‌’ బంపర్ ఆఫర్..

అయితే కాశ్మీర్ పండిట్ల విషయంలో మతం మారాలంటూ వాళ్ళని చంపేశారు. ఇక్కడ హిందువులు దైవంగా పూజించే ఆవుల్ని చంపి తినడానికి తీసుకెళ్తుంటే కొట్టారు. ఈ రెండు సంఘటనలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలని ఉద్దేశించి వాటి గురించి సాయి పల్లవికి తెలీదు అనుకుంట, రెండు వేరు వేరు, సగం సగం తెలిసి మాట్లాడొద్దు అంటూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. సాయి పల్లవిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో సాయి పల్లవి మీద దేశ వ్యాప్తంగా నెగిటివిటి వస్తుంది.

ఇక కొంతమంది అయితే విరాట పర్వం సినిమా చూడం, సినిమాని బ్యాన్ చేస్తాం, సాయి పల్లవి క్షమాపణలు చెప్పాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. అసలే సాయి పల్లవి క్రేజ్ మీద విరాటపర్వం సినిమాని ప్రమోట్ చేస్తున్న సమయంలో సాయి పల్లవి ఇలాంటి వ్యాఖ్యలు చేసి మొదటికే మోసం తెచ్చింది. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ ఇప్పుడు విరాట పర్వం సినిమాపై పడేలా ఉంది. మరి దీనిపై సాయి పల్లవి ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాలి.