Tammareddy Bharadwaja : బింబిసార రెగ్యులర్ కమర్షియల్ సినిమానే.. నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకండి..

ఈ సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ కూడా వచ్చాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకుండా............

Tammareddy Bharadwaja : బింబిసార రెగ్యులర్ కమర్షియల్ సినిమానే.. నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకండి..

bimbisara

Tammareddy Bharadwaja :  ఇటీవల రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందరూ ఈ సినిమాలని పొగుడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాలు చూసి వారి రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ రెండు సినిమాల గురించి మాట్లాడుతూ తన ఛానల్ లో ఓ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో మొదట సీతారామం సినిమా గురించి, ఆ డైరెక్టర్ గురించి గొప్పగా పొగిడారు. ఆ తర్వాత బింబిసార సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఈ మూవీ రెగ్యులర్‌ కమర్షియల్‌ కథే. కాకపోతే కథలో కొత్తదనం కోసం బింబిసారుడు అనే రాజుని తీసుకొచ్చి, అతను ఇప్పుడు ఉంటే ఎలా ఉంటాడు అనే కాన్సెప్ట్ ని జత చేసి కమర్షియల్ సినిమాలా తెరకెక్కించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీసి మంచి విజయం సాధించాడు. మాములు కమర్షియల్ కథలని కూడా కొత్తదనంతో చూపిస్తే హిట్ అవుతాయని మరోసారి నిరూపించాడు వశిష్ట. టైం ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని ఆదిత్య 369తో పోల్చి చూడటం మాత్రం కరెక్ట్ కాదు” అని అన్నారు.

Ashwini Dutt : ఆ సినిమా తీసి 12 కోట్లు పోగొట్టుకున్నాం.. జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 నా చివరి సినిమా..

”అలాగే ఈ సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ కూడా వచ్చాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకుండా థియేటర్ కి రెగ్యులర్‌ ఆడియన్స్‌ పెరిగేలా చూడాలి. సినిమాను కనీసం నాలుగు వారాలన్నా థియేటర్లో ఆడించాలి. థియేటర్లలో సౌకర్యాలు పెట్టి, ఫుడ్ రేట్లు తగ్గించడంతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని తీసుకురావాలి. మంచి సినిమాలు వచ్చి థియేటర్లను బతికించాలి” అని అన్నారు. అలాగే కళ్యాణ్ రామ్ ని అభినందిస్తూ కొత్త డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇస్తూ మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.