Vijay Antony: విడాకులకు సిద్ధమైన మరో హీరో?

బిచ్చగాడు సినిమాతో తెలుగునాట మంచి ఫేమ్ సంపాధించుకున్న హీరో "విజయ్ ఆంటోనీ". సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ హీరో.. ఆ తరువాత నటుడిగా, సింగర్ గా, ఎడిటర్ గా, దుబ్బింగ్ ఆర్టిస్ట్ గా, లిరిసిస్ట్ గా, దర్శక నిర్మాతగా, ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన మార్క్ ని చూపిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపుని దక్కించుకున్నాడు.

Vijay Antony: విడాకులకు సిద్ధమైన మరో హీరో?

Vijay Antony and his wife getting Divorced

Updated On : October 13, 2022 / 3:56 PM IST

Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగునాట మంచి ఫేమ్ సంపాధించుకున్న హీరో “విజయ్ ఆంటోనీ”. సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ హీరో.. ఆ తరువాత నటుడిగా, సింగర్ గా, ఎడిటర్ గా, దుబ్బింగ్ ఆర్టిస్ట్ గా, లిరిసిస్ట్ గా, దర్శక నిర్మాతగా, ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన మార్క్ ని చూపిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపుని దక్కించుకున్నాడు.

Vijay Antony : ‘బిచ్చగాడు 2’ తో దర్శకుడిగా విజయ్ ఆంటోని..

ఇక విషయానికి వస్తే.. విజయ్ ఆంటోనీ, అతని భార్య ఫాతిమా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో విజయ్ చేసిన ఒక ట్వీట్ నెట్టింట చర్చకు దారి తీస్తుంది. “మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, అది మీరే పరిష్కరించుకోండి. అంతేగానీ మీ మధ్యలో మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి” అంటూ వ్యాఖ్యానించాడు.

దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అన్న వార్తలు నిజమేనేమో అన్న అనుమానాలను నిజం చేస్తున్నాయి. సినీ నిర్మాత అయిన ఫాతిమా 2006లో విజయ్ ని పెళ్లి చేసుకోగా, వీరికి ఒక కూతురు కూడా ఉంది. కాగా ప్రస్తుతం విజయ్ బిచ్చగాడు-2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. మరి ఈ సీక్వెల్ తో ఎంతటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.