Bihar: నితీశ్‭కు కొత్త తలనొప్పి.. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి 5గురు జేడీయూ ఎమ్మెల్యేలు డుమ్మా

నితీశ్, తేజస్వీ కలయికలో మంగళవారం బిహార్‭లో 31 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆర్జేడీ నుంచి 16, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. అయితే ఆర్జేడీతో కలవడంపై అసంతృప్తిగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్, పంకజ్ కుమార్ మిశ్రా, సుదర్శన్ కుమార్, రాజ్కుమార్ సింగ్, షాలిని మిశ్రాలు మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాలేదు

Bihar: నితీశ్‭కు కొత్త తలనొప్పి.. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి 5గురు జేడీయూ ఎమ్మెల్యేలు డుమ్మా

5 JDU MLAs skip Bihar cabinet expansion ceremony

Bihar: భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని దాటుకొని చిరకాల మిత్రశత్రువు ఆర్జేడీతో చేతులు కలిపిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭కు కొత్త తలనొప్పి తయారైంది. సొంత పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయనున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్రలో లాగ జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ మ్యానేజ్ చేసినా చేయొచ్చనే అంచనాలు కొంత కాలం క్రితం నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి వాదనలు ఎలా ఉన్నా తాజాగా బిహార్‭లో జరిగిన మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి నితీశ్ పార్టీ అయిన జనతా దళ్ యునైటెడ్‭కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

నితీశ్, తేజస్వీ కలయికలో మంగళవారం బిహార్‭లో 31 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆర్జేడీ నుంచి 16, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. అయితే డాక్టర్ సంజీవ్ కుమార్, పంకజ్ కుమార్ మిశ్రా, సుదర్శన్ కుమార్, రాజ్కుమార్ సింగ్, షాలిని మిశ్రాలు మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాలేదు. వీరంతా మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారట. అలాగే ఆర్జేడీతో చేతులు కలపడం కూడా వీరికి నచ్చలేదని వినికిడి. కారణాలేవైనా.. జేడీయూలో అసమ్మతి పెరిగితే వారంతా బీజేపీ వైపే వెళ్తారని అలా జరిగితే మరో ఉద్ధవ్ పరిస్థితే నితీశ్‮‭కు ఎదురవ్వొచ్చని అంటున్నారు.

Rajasthan: నా తండ్రికి స్కూల్లో నీళ్లివ్వలేదు.. 9 ఏళ్ల చిన్నారి మరణంపై మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ కుమర్తె భావోద్వేగ స్పందన