Afghanistan Cricket: అఫ్ఘాన్ మహిళా క్రికెట్ జరగపోతే.. మెన్స్ జట్టుతో ఆడేది లేదు – క్రికెట్ ఆస్ట్రేలియా

క్రికెటర్లపై ఎటువంటి ఆంక్షలు లేవని చెప్పారు తాలిబాన్లు. ఈ క్రమంలో అఫ్ఘాన్ కు వచ్చి ఆడాలనుకున్నా.. అఫ్ఘాన్ క్రికెటర్లు విదేశాలకు వెళ్లి ఆడాలన్నా పూర్తి స్వేచ్ఛ ఉంటుందని..

Afghanistan Cricket: అఫ్ఘాన్ మహిళా క్రికెట్ జరగపోతే.. మెన్స్ జట్టుతో ఆడేది లేదు – క్రికెట్ ఆస్ట్రేలియా

Afghan Women Cricket

Afghanistan Cricket: క్రికెటర్లపై ఎటువంటి ఆంక్షలు లేవని చెప్పారు తాలిబాన్లు. ఈ క్రమంలో అఫ్ఘాన్ కు వచ్చి ఆడాలనుకున్నా.. అఫ్ఘాన్ క్రికెటర్లు విదేశాలకు వెళ్లి ఆడాలన్నా పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే మహిళా క్రికెట్ కు మాత్రం నో చెప్పేసింది. మహిళా క్రికెట్ ఆడేది లేదని.. మహిళలు అసలు ఏ క్రికెట్ ఆడటానికి కూడా వీల్లేదని రూల్ పెట్టారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రెస్పాండ్ అయింది.

ఆఫ్ఘ‌నిస్తాన్‌తో చ‌రిత్రాత్మ‌క టెస్టు క్రికెట్ మ్యాచ్ నిర్వ‌హించేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా రీసెంట్ గా వార్నింగ్ ఇచ్చింది. న‌వంబ‌ర్ 27న హోబార్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను ఆపేస్తామని అన్నారు.

తాలిబ‌న్ క‌ల్చ‌ర‌ల్ నేత అహ్మ‌దుల్లా వాసిక్ మాట్లాడుతూ.. మ‌హిళ‌లు క్రికెట్ ఆడ‌ర‌ని, ఏ ఆట కూడా వాళ్లు ఆడ‌బోర‌న్నారు. మ‌హిళ‌లు క్రికెట్ ఆడాల్సినంత అవ‌స‌రం లేద‌న్నారు. క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ముఖం కానీ, శ‌రీరం కానీ బ‌హిర్గ‌తం అవుతుంద‌ని, ఇస్లాం ప్ర‌కారం మ‌హిళ‌ల్ని ఇలా చూడ‌లేమ‌ని అన్నారు.

దీనిపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మ‌హిళ‌ల‌కు క్రికెట్ ఆడే అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు.. అఫ్ఘానిస్తాన్ పురుషుల జ‌ట్టుతోనూ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన అవ‌స‌రం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. మ‌హిళా క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెర‌గాల‌ని ఆశిస్తున్నామ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. ఒకవేళ తాలిబ‌న్లు మ‌హిళా క్రికెట‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుంటే, అప్పుడు మెన్స్ జ‌ట్టుతో హోబర్ట్‌లో జ‌రిగే మ్యాచ్‌ను ర‌ద్దు చేయాల్సి ఉంటుంద‌ని వెల్లడించింది.