Home » After Exercise
వ్యాయమాల తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. సరైన ఆహారం, ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం. వ్యాయామాలకు ముందు, తరువాత శరీరానికి పోషకాల తో కూడిన ఆహారం అందించటం అవసరం. గ్లూకోజ్ స్ధాయిలు తగ్గకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
వ్యాయామం తరువాత తక్షణ శక్తి కోసం అరకప్పు ఉడికించిన ఓట్సిని కాని, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పుతో కలిపి తీసుకోవచ్చు. ఒక అరటి పండు, ఒక గ్లాసు పాలు తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
వ్యాయామానికి ముందు ఏమీ తినకపోతే,రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే కేలరీల కొరత కారణంగా తలనొప్పికి కారణమవుతుంది.