After Exercise : వ్యాయామాల తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

వ్యాయమాల తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. సరైన ఆహారం, ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం. వ్యాయామాలకు ముందు, తరువాత శరీరానికి పోషకాల తో కూడిన ఆహారం అందించటం అవసరం. గ్లూకోజ్ స్ధాయిలు తగ్గకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

After Exercise : వ్యాయామాల తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

After Exercise Food

Updated On : July 20, 2022 / 4:13 PM IST

After Exercise : బరువు తగ్గటానికి, కండరాలు బలేపేతం కావటానికి వ్యాయామాలు తోడ్పడతాయి. అంతేకాకుండా రోజు వారి వ్యాయామాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు దరి చేరకుండా చూసుకోవచ్చు. వాకింగ్, జాగింగ్ , జిమ్, యోగా వంటి వాటిని చాలా మంది నిత్యం అనుసరిస్తున్నారు. అయితే వ్యాయమాల రోజు వారిగా చేసే వారు ఆ తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై చాలా మందికి అవగాహన లేదు. వ్యాయమం వల్ల ఆరోగ్యం మెరుగుడపటమన్నది వాస్తవమే అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా పోషకాలను శరీరానికి అందించినప్పుడు అది సాధ్యమవుతుంది.

వ్యాయమాల తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. సరైన ఆహారం, ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం. వ్యాయామాలకు ముందు, తరువాత శరీరానికి పోషకాల తో కూడిన ఆహారం అందించటం అవసరం. గ్లూకోజ్ స్ధాయిలు తగ్గకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వ్యాయామం తరువాత గింజలు, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవటం మంచిది. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. వ్యాయామం తరువాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడి బరువు తగ్గటం సులభతరమౌతుంది.

మొలకెత్తిన పెసర పప్పు, సోయాబీన్ లేదా శనగలు మొదలైన వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వ్యాయామం తరువాత వీటిని తీసుకోవడం మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. వ్యాయామం తరువాత ఓట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఓట్స్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. వ్యాయామాలు పూర్తియిన 45 నిమిషాల్లోపు అరటి పండ్లు తినటం చాలా మంచిది. కండరాల్లో గ్లైకోజెన్‌ నిల్వలు పడిపోకుండా చూస్తాయి. వ్యాయామం తరువాత పాలు తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా వ్యాయామం తరువాత తగినన్ని నీళ్లు సేవించటం మంచిది.