Home » Ap Elections 2024
ఏపీలో పొత్తుల పంచాయితీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది.
బీసీలను మోసం చేసిన నాయకులలో ప్రథముడు చంద్రబాబు నాయుడని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
6 వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది వైసీపీ. మీ కల నా కల అంటూ వైఎస్ జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది.
క్లారిటీ వచ్చేసింది. ఎజెండా ఫిక్స్ అయ్యింది. సిద్ధంతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్ మెంట్ తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు.
విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా?
మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.