TDP Janasena Second List : టీడీపీ 25, జనసేన 10..! కూటమి సెకండ్ లిస్ట్ రెడీ..!

రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

TDP Janasena Second List : టీడీపీ 25, జనసేన 10..! కూటమి సెకండ్ లిస్ట్ రెడీ..!

TDP Janasena Second List

TDP Janasena Second List : బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే టీడీపీ-జనసేన రెండో జాబితాను విడుదల చేయనున్నారు. ఇవాళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ గంటన్నరపాటు భేటీ అయ్యారు. రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ వ్యవహారాలపైనా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. రేపు చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది.

ఈ ఉదయం చంద్రబాబు, పవన్ గంటన్నరపాటు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. నారా లోకేశ్ కూడా అటెండ్ అవ్వలేదు. ఆయన మరో సమావేశంలో ఉన్నారు. పలు కీలక అంశాలపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లు సమాచారం. రెండో జాబితాకు సంబంధించి డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లు రెండో జాబితా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ-జనసేన మధ్య క్లాష్ లేకుండా వ్యవహారాలు చేస్తున్నారు. రెండో జాబితాలో 25 స్థానాలు ప్రకటించాలని టీడీపీ అనుకుంటోంది. మొదటి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన జనసేన.. రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించాలని ప్రణాళికలు రూపొందించుకుంది జనసేన. సీట్ల ప్రకటన సమయంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తకుండా స్థానికంగా ఉన్న లీడర్లను బుజ్జగించేందుకు టీడీపీ-జనసేన ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సమాచారం.

సీటు రాని నేతలను చంద్రబాబు బుజ్జగించే పనిలో ఉన్నారు. చాలా మంది నేతలను చంద్రబాబు నివాసానికి పిలిపించుకుని వారితో మాట్లాడారు. పరిస్థితులను వివరించి, అర్థం చేసుకోవాలని కోరినట్లు సమాచారం. సీట్లు రాని నేతలకు రేపు ప్రభుత్వం వచ్చాక ఉన్నత స్థానాలు కల్పించాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీ వ్యవహారంపైనా ఇరువురు నేతలు చర్చించారు. బీజేపీతో పొత్తు ఖరారైతే.. కేంద్రం నుంచి కొన్ని హామీలు ఏపీ ప్రజానికానికి అవసరం ఉంది. రేపు ఉదయం ఇరువురూ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం వద్ద ఏయే అంశాలపై క్లారిటీ తీసుకోవాలి అనే దానిపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. ఏపీకి సంబంధించి ముఖ్యంగా రాజధాని అమరావతి అంశం, విభజన సమస్యలు.. వీటన్నింటిపై బీజేపీ హైకమాండ్ నుంచి ఒక క్లారిటీ, సానుకూల ప్రకటన ఇప్పించాలి అనేది చంద్రబాబు, పవన్ ఆలోచనగా తెలుస్తోంది.

Also Read : పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్..! కాపు నేతలపై స్పెషల్ ఫోకస్

పూర్తి వివరాలు..