Home » Bay of Bengal
గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. కొన్నింటి గమ్యాలను కుదించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుతుపుతున్నారు. ఒడిశా మీదుగా వెళ్లే 24 రైళ్లను రద్దు చేశారు.
రాష్ట్రాలను గడగడలాడించేందుకు తుపాను ముంచుకొస్తోంది. ముఖ్యంగా ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది. వాయిగుండంగా మారి దూసుకొస్తోంది.
ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్ల మధ్య ఈ నెల 26న తీరం దాటే అవకాశాలున్నాయి.
ఈరోజు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర, మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 12, 13 తేదీల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.