Rains In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు

ఈరోజు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం  హైదరాబాద్ లో పలు  ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Rains In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు

Telangana Rains

Updated On : September 22, 2021 / 11:19 AM IST

Rains In Telangana :  ఈరోజు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం  హైదరాబాద్ లో పలు  ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరంవద్ద  అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్లు వరకు వ్యాప్తించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిషా మీదుగా తెలంగాణ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్న చెప్పారు.

Also Read : Exchange of Fire : ఏవోబీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు

బుధవారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్కాపురి, నాగోల్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, రాంనగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.