Rains : ఏపీలో జోరుగా వర్షాలు

ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Rains : ఏపీలో జోరుగా వర్షాలు

Ap Rain

Updated On : September 5, 2021 / 8:16 AM IST

ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో కురిసిన వర్షాలకు ఆకూరు- బడిగుంట గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతికి గల్లంతై ముగ్గురు మృత్యువాత పడ్డారు. వాగు దాటే యత్నం చేసినవారిలో 30 ఏళ్ల వెట్టి జ్యోతితో పాటు ఐదేళ్ల వయస్సున్న వెట్టి వంశీ దొర, పొడియం గణేష్ దొర ..జారి పడిపోయారు.

కడప జిల్లా పెద్ద ముడియం మండలంలో కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కుందూ నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నెమళ్లదిన్నె బ్రిడ్జిపై వరద ప్రవాహంతో బలపనగూడూరుకు రాకపోకలు స్తంభించిపోయాయి.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడి.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కడప, కర్నూలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది.