Cyclone : గులాబ్ గుబుల్, తుపాన్ ముప్పు..సాయంత్రం తీరం దాటే అవకాశం

రాష్ట్రాలను గడగడలాడించేందుకు తుపాను ముంచుకొస్తోంది. ముఖ్యంగా ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది. వాయిగుండంగా మారి దూసుకొస్తోంది.

Cyclone : గులాబ్ గుబుల్, తుపాన్ ముప్పు..సాయంత్రం తీరం దాటే అవకాశం

Ap Cyclone

Updated On : September 26, 2021 / 6:38 AM IST

Cyclone Gulab : రాష్ట్రాలను గడగడలాడించేందుకు తుపాను ముంచుకొస్తోంది. ముఖ్యంగా ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది. వాయిగుండంగా మారి దూసుకొస్తోంది. సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పూరి, గంజాం, గజపతి, ఇక ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై గులాబ్‌ తుపాను ప్రభావం పడనుంది. సైక్లోన్‌ ఎఫెక్ట్‌తో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో..  తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని .. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Read More : Bigg Boss 5 : ముగ్గురిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో ?

తుపాను ప్రభావంతో  ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను సూచనలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు పరిధిలో .. పరిస్థితులను గమనిస్తూ ఉండాలని .. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read More : Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షములు ఒకటి, రెండు ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు వస్తోంది. గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా 500 కిలో మీటర్లు, కళింగపట్నానికి తూర్పుగా 600 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.