Home » Bengal Gram
Bengal Gram Cultivation : శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం వుంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది. విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి.
శనగ పైరు పూత దశలో వున్నప్పుడు ఆ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పూత పిందే దశలలో గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ తెలుగు ఉధృతి అధికంగా ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కలలో కాయలు ఏర్పడవు. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయ
ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి.
తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి.
కలుపు యాజమాన్యం విషయానికి వస్తే విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు1-1.2 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి.