Bengal Gram Cultivation : రబీ శనగ సాగుకు అనువైన రకాల ఎంపిక.. యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది. విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి.

Bengal Gram
Bengal Gram Cultivation : శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం వుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో నల్లరేగడి భూముల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో శనగను సాగుచేస్తున్నారు. ఈ పంటలో మంచి యజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. శనగ సాగుకు అనువైన రకాలు, యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువలు గురింటి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. జగన్మోహన రావు ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు
రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప,పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ వుండే నల్లరేగడి భూముల్లో రబీపంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. శనగ విత్తుకోవటానికి అక్టోబరు నుండి నవంబరు మొదటి పక్షం వరకు అనుకూలం. మార్కెట్ డిమాండ్ నుబట్టి సాధారణ రకాలతోపాటు, కాబూలీ రకాలను సాగుకు ఎంచుకుంటే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. జగన్మోహన రావు.
READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు
తెలంగాణలో సుమారు 2 లక్షల 75 వేల ఎకరాల్లో శనగ సాగుచేస్తున్నారు. ప్రధానంగా జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది. విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే నీటి సదుపాయం లేనప్పుడు ఎరువులను సకాలంలో అందించే వీలుండదు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
శనగ పంట తొలిదశలో భూమి ద్వారా ఆశించే ఫ్యూజేరియం ఎండు తెగులు, ఆకుతినే పురుగుల బెడద ఎక్కువ వుంటుంది. దీన్ని అధిగమించేందుకు విత్తేముందు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 2గ్రాముల క్యాప్టాన్ లేదా థైరమ్ పట్టించాలి లేదా 2.5 గ్రాముల కార్బండిజం పట్టించి విత్తాలి. కొత్తగా శనగ పంట వేసే రైతులు తప్పనిసరిగా ప్రతి 8కిలోల విత్తనానికి 200గ్రాముల రైజోబియం కల్చర్ పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్లయితే గాలిలోని నత్రజని వేర్లకు బుడిపెల ద్వారా అందించి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.